HOME »NEWS »SPORTS »bcci vice president rajeev shukla trolled after he pointing out the religion of indian players in appreciation tweet srd

BCCI : ఎరక్కపోయి ఇరుక్కున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా..ఆ క్రికెటర్ క్రిస్టియన్ అంటూ ట్వీట్..

BCCI : ఎరక్కపోయి ఇరుక్కున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా..ఆ క్రికెటర్ క్రిస్టియన్ అంటూ ట్వీట్..
BCCI Vice President Rajeev Shukla

BCCI : ఎరక్కపోయి ఇరుక్కున్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా. ఆయన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ముందు వెనుకా చూసుకోకుండా ఆయన చేసిన పనే ట్రోలింగ్ కు కారణమైంది.

  • Share this:
    ఎరక్కపోయి ఇరుక్కున్నారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా. ఆయన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ముందు వెనుకా చూసుకోకుండా ఆయన చేసిన పనే  ట్రోలింగ్ కు కారణమైంది. వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు ట్వీట్ చేస్తే ఇలానే ఉంటుందని అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటలో అద్భుత విజయాన్నందుకున్న భారత జట్టును ప్రశంసిస్తూ రెండు రోజుల క్రితం రాజీవ్ శుక్లా ట్వీట్ చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గబ్బా కోటలను బద్దలు కొట్టిన అరంగేట్ర ఆటగాళ్లను ఈ ట్వీట్‌లో ప్రత్యేకంగా అభినందంచాడు. అయితే ఈ ట్వీట్‌లో యువ ఆటగాళ్ల మతాన్ని ప్రస్తావించిన రాజీవ్ శుక్లా.. వాషింగ్టన్ విషయంలో పొరపాటు చేశాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ట్రోలింగ్‌తో రోస్ట్ చేశారు. భారత్‌ జట్టులోని భిన్నత్వంలో ఏకత్వాన్ని తన ట్వీట్ ద్వారా రాజీవ్ శుక్లా తెలియజేసే ప్రయత్నం చేశాడు. వివిధ మతాలకు చెందిన ఆటగాళ్లంతా భారత్‌కు విజయాన్నందించారని ట్వీట్‌లో పేర్కొన్నాడు. " రిషభ్ పంత్- హిందూ, మహ్మద్ సిరాజ్- ముస్లిం, శుభ్‌మన్ గిల్- సిక్కు, వాషింగ్టన్ సుందర్-క్రిస్టియన్.. అందరూ కలిసి భారత్‌ను గెలిపించారు. ఈ సందేశాన్ని నా స్నేహితుడు పంపాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని హిందీలో ట్వీట్ చేశాడు.

    అయితే శుక్లా ట్వీట్‌లో వాషింగ్టన్ సుందర్ క్రిస్టియన్ అని పేర్కొన్నాడు కానీ.. అతను హిందువే. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ను ఆడుకుంటున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయ్యుండి ఇలాంటి వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌లు ట్వీట్ చేయడాన్ని నమ్మలేకపోతున్నామని విమర్శిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ హిందువే అని చెప్పడానికి కావాల్సిన రుజువులను కూడా తమ కామెంట్లకు జత చేస్తున్నారు. ఇలాంటి గలత్ మెసేజ్‌లు ట్వీట్ చేయవద్దని ఘాటుగా విమర్శిస్తున్నారు. పేరులో వాషింగ్టన్ ఉంటే క్రిస్టియన్ అయితారా? అని ప్రశ్నిస్తున్నారు.
















    ఇక వాషింగ్టన్ సుందర్ పేరు చూసి అందరూ క్రిస్టియన్ అని భావిస్తారు. కానీ సుందర్ హిందూ కటుంబంలోనే జన్మించాడు. అయితే ఆ పేరెందుకు అలా పెట్టుకున్నాడనే విషయంపై సుందర్ తండ్రే ఒకసారి మీడియాకు వివరించాడు. తన చిన్నతనంలో చదువుతో పాటు క్రికెట్‌ మెళకువలను పీడీ వాషింగ్టన్ అనే ఆర్మీ అధికారి నేర్పించాడని, ఆర్థికంగా సాయం చేశాడన్నాడు. ఆయన సాయానికి గుర్తుగానే తన కొడుకుకు వాషింగ్టన్ సుందర్ అని పేరుపెట్టుకున్నానని తెలిపాడు. ఇక లేటెస్ట్ గా సుందర్ సంగీత దిగ్గజం ఏఆర్ రహమాన్ కలిశాడు. ట్విట్టర్ వేదికగా ఆ ఫోటోలను షేర్ చేశాడు సుందర్. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయ్.
    Published by:Sridhar Reddy
    First published:January 27, 2021, 22:58 IST