ఆ ఒక్క నగరంలోనే ఐపీఎల్.. బీసీసీఐ కీలక నిర్ణయం?


Updated: July 2, 2020, 10:54 AM IST
ఆ ఒక్క నగరంలోనే  ఐపీఎల్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
సన్ రైజర్స్
  • Share this:
పడుతూ వస్తుంది. ఈవెంట్ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై బీసీసీఐ తర్జనబర్జన పడుతుంది. ఈ మెగా ఈవెంట్‌ సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా వేదిక విషయంలో బిసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ జరిగితే ఒకే నగరానికి ఈవెంట్‌ను పరిమితం చేయాలని బీసీసీఐకి సీనియర్లు బోర్డుకు సూచించారు. దేశంలో అత్యధిక స్టేడియాలు ముంబాయిలో ఉన్నాయి కనుక అక్కడే ఐపీఎల్ నిర్వహిస్తే సౌకర్యంగా ఉంటుందన్నారు. ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలున్నాయి. వీటితో పాటు రిలయెన్స్‌ ఫ్రాంచైజీకి కూడా ఓ స్వంత మైదానం ఉంది.

 

 

అంతేయకాకుండా ఆటగాళ్ళు ఉండేందుకు కూడా నగరం సౌకర్యవంతంగా ఉంటుంది. అనేక స్టార్‌ హోటళ్లు,  అందుబాటులో విమానాశ్రయం లాంటి  వసతులు ఉండడంతో ముంబై ఐపీఎల్ నిర్వహణకు సులువుగా ఉంటుందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

 

కానీ ప్రస్తుతం ముంబైలో  వైరస్ విజృభిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఈ పరిస్ధితులలో ఐపీఎల్ నిర్వహించడం కష్టం. అయితే అక్టోబర్‌ కల్లా ముంబైలో వైరస్‌ నియంత్రణలోకి వస్తే అక్కడే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
First published: July 2, 2020, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading