IPL New Teams: ఐపీఎల్‌లో కొత్త జట్లను ఎప్పుడు ప్రకటిస్తుందో చెప్పిన బీసీసీఐ? కొత్త బ్రాడ్‌కాస్టర్‌ కోసం టెండర్లు కూడా అప్పుడే..

ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల ప్రకటన ఎప్పుడో తెలుసా? (PC: BCCI)

IPL: ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన వెంటనే రెండు కొత్త జట్ల ప్రకటన చేస్తామని బీసీసీఐ తెలిపింది. అదే రోజు 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల టెండర్లు కూడా పిలుస్తామని స్పష్టం చేసింది.

  • Share this:
    క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో (IPL) మరో రెండు కొత్త జట్ల ప్రకటనకు రంగం సిద్దమైంది. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఈ ప్రక్రియ అక్టోబర్ 25 నాటికి పూర్తవుతుందని బీసీసీఐ (BCCI) ఒక ప్రకటనలో తెలిపింది.
    మంగళవారం (సెప్టెంబర్ 28) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) (IPL governing Council) సమావేశం యూఏఈలో నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ జీసీ నిర్ణయాల మేరకు అక్టోబర్ 17న కొత్త జట్ల కోసం ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఐపీఎల్ కొత్త జట్ల కోసం ఇన్విటేషన్ టు టెండర్ (ఐటీటీ) (ITT) కొనుగోలు తుది గడువును అక్టోబర్ 5 నుంచి 10 వరకు పొడిగించింది. అయితే ఐటీటీ విక్రయ ప్రక్రియ మాత్రం అగస్టు 31నే ప్రారంభం అయ్యింది. ఐటీటీని కొనుగోలు చేసిన సంస్థలు/కన్సార్టియంలు వెంటనే వెంటనే బిడ్లు దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ బిట్లను అక్టోబర్ 25న తెరవనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.

    గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లో 8 జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. అయితే లీగ్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా మరో రెండు కొత్త జట్లను చేర్చాలని గవర్నింగ్ కౌన్సిల్ ప్రతిపాదన మేరకు బీసీసీఐ నిర్వహించింది. ఈ మేరకు టీమ్స్ సంఖ్యను 8 నుంచి 10కి పెంచుతున్నట్లు బీసీసీఐ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఇటీవల అహ్మదాబాద్, లక్నో, పూణే కేంద్రాలుగా రెండు కొత్త జట్ల కోసం ఐటీటీ ఆహ్వానించింది. ఈ మూడు నగరాల్లో అత్యధిక బిడ్లు దాఖలు అయ్యే రెండు నగరాలకు కొత్త జట్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్ అహ్మదాబాద్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నది. మిగిలిన రెండు నగరాల్లో లక్నో కేంద్రంగా ఎక్కువ బిడ్లు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

    IPL 2021: దినేశ్ కార్తీక్‌ను బ్యాటుతో కొట్టబోయిన రిషబ్ పంత్.. తృటిలో తప్పించుకున్న డీకే.. అసలేం జరిగింది?




    IPL 2021: ఒకే రోజు.. ఒకే సమయంలో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు.. లీగ్ చరిత్రలో తొలిసారి.. బీసీసీఐ కీలక నిర్ణయం






    అక్టోబర్ 25న కొత్త జట్లను ప్రకటించిన వెంటనే 2023-27 సీజన్లకు కొత్త బ్రాడ్‌కాస్టర్‌కు సంబంధించిన టెండర్లను కూడా విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొన్నది. ప్రస్తుతం స్టార్ ఇండియాకు 2022 వరకు డిజిటల్, టీవీ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు ఉన్నాయి. అవి నెక్ట్స్ సీజన్‌తో పూర్తి కానుండటంతో కొత్త హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు పిలవనున్నది. ఇటీవల మీడియా రంగంలో అతిపెద్ద విలీనంగా భావిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ - సోనీ పిక్చర్స్ ఐపీఎల్ హక్కుల కోసం పోటీ పడనున్నట్లు సమాచారం.
    Published by:John Naveen Kora
    First published: