IPL 2022 New Franchise : కొత్త ఫ్రాంచైజీల అమ్మకానికి బీసీసీఐ కసరత్తు.. ఈ సీజన్ ముగిసేలోపే కొత్త జట్ల వేలం

ఐపీఎల్ 2022లో కొత్త ఫ్రాంచైజీల కనీస ధర తెలిస్తే షాకవ్వాల్సిందే. (IPL)

 • Share this:
  ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ నుంచి కొత్తగా రెండు జట్లను చేర్చనున్నట్లు గతంలోనే బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్ (IPL) కరోనా కారణంగా వాయిదా పడకుంటే ఇప్పటికే రెండు జట్ల బిడ్డింగ్ ప్రక్రియ మొదలు అయ్యేది. అయితే ఐపీఎల్ 2021లో 29 మ్యాచ్‌ల తర్వాత వాయిదా పడింది. దీంతో మే నెలాఖరులో ప్రారంభం కావల్సిన కొత్త ఫ్రాంచైజీల బిడ్డింగ్ ప్రక్రియను కూడా వాయిదా వేశారు. తాజాగా వస్తున్న సమాచారం మేరకు జులై నెలలో కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ టెండర్లు పిలవనున్నారు. ఒక్కో జట్టు ధర కనీసం రూ. 2000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. అలా చూసినా బీసీసీఐ ఈ రెండు జట్లపై కనీసం రూ. 4 వేల కోట్లు తమ ఖజానాలో జమ చేసుకుంటుంది. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీలపై ఇండియాలోని బడా కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. 'కొత్త జట్లకు జులైలో టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు మాకు సమాచారం అందింది. ఒక్కో ఫ్రాంచైజీని 250 మిలియన్ డాలర్ల కనీస ధరకు అమ్మాలని బోర్డు నిర్ణయించినట్లు మాకు తెలిసింది.' అని కొత్త ఫ్రాంచైజీ కొనగోలు పట్లు ఆసక్తిగా ఉన్న ఒక బడా సంస్థ సీఈవో తెలిపారు.

  కొత్త ఫ్రాంచైజీలకు భారీ ధర నిర్ణయించడంపై బోర్డు అధికారులు కూడా ఒక లాజిక్ చెబుతున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో 15 శాతం వాటాను భారీ ధరకు అమ్మింది. రాజస్థాన్ రాయల్స్ విలువను ఇటీవల కొన్ని సంస్థలు అధ్యయనం చేయగా రూ. 1855 కోట్లుగా తేల్చారు. ఐపీఎల్‌లోనే తక్కువ విలువ కలిగిన రాజస్థాన్ జట్టే దాదాపు రూ. 2 వేల కోట్లుగా ఉండగా.. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 2500 కోట్లు.. ముంబై ఇండియన్స్ రూ. 2800 కోట్లు విలువ చేయవచ్చని బీసీసీఐ భావిస్తున్నది. అందుకే కొత్త ఫ్రాంచైజీలకు కనీస ధర రూ. 2 వేల కోట్లుగా నిర్దారించినట్లు సమాచారం.

  ఐపీఎల్ రెండో దశ సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్నది. అప్పటి లోగా కొత్త ఫ్రాంచైజీలకు సంబంధించిన టెండర్లర ప్రక్రియ ముగించనున్నట్లు సమాచారం. మరోవైపు 10 జట్లతో ఐపీఎల్ 2022 నిర్వహించనుండటంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరగనున్నది. దీంతో ఐపీఎల్ ప్రసార హక్కులకు సంబంధించిన ధరలు కూడా పెరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఫ్రాంచైజీ ఆదాయం 50 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
  Published by:John Naveen Kora
  First published: