Home /News /sports /

BCCI TO SAVE RS 1500 CRORE AFTER ICC AGREES TO BEAR TAX BURDEN CHECK DETAILS JNK

BCCI: బీసీసీఐకి కలిసొచ్చిన లక్.. రూ. 1500 కోట్ల నష్టాన్ని పూడ్చనున్న ఐసీసీ... ఎందుకో తెలుసా?

బీసీసీఐపై పన్నుల భారాన్ని తగ్గించనున్న ఐసీసీ (PC: ICC)

బీసీసీఐపై పన్నుల భారాన్ని తగ్గించనున్న ఐసీసీ (PC: ICC)

BCCI: బీసీసీఐకి మరోసారి అదృష్టం వరించింది. మెగా టోర్నీల నిర్వహణ వల్ల పనున్న రూపంలో భారీగా కోల్పోతున్న ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ ముందుకు వచ్చింది. ఐసీసీ కట్టే పన్నుల్లో 10 శాతాన్ని భరిస్తామని హమీ ఇచ్చింది.

    ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డుగా పేరున్న బీసీసీఐకి (BCCI) మరో సారి లక్ కలసి వచ్చింది. ఐసీసీ (ICC) ఈవెంట్ల వల్ల బీసీసీఐపై పడుతున్న పన్నుల (Taxes) భారం తగ్గనున్నది. 2024 నుంచి 2031 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో బీసీసీఐ మూడు ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మెగా ఈవెంట్ల నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి (Central government) వివిధ రూపాల్లో భారీగా పన్నులు చెల్లించాల్సి ఉన్నది. అయితే ఆ భారంలో 10 శాతం భరిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది. దీంతో బీసీసీఐకి దాదాపు రూ. 1500 కోట్లు మిగలనున్నాయి. ఈ మేకు బీసీసీఐ, ఐసీసీ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. మెగా ఈవెంట్ల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కంటే పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి వస్తుందని బీసీసీఐ చెప్పడంతో ఆ మేరకు కొంత భారాన్ని తగ్గించడానికి ఐసీసీ ఒప్పుకున్నది.

    2016 టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో పాటు 2023 వన్డే వరల్డ్ కప్ వల్ల బీసీసీఐ దాదాపు రూ. 750 కోట్లు నష్టపోతున్నది. ఒక వేళ 2021 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించి ఉంటే ఈ నష్టం మరింతగా పెరిగేది. దీనికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం ఎలాంటి పన్ను రాయితీలు ఇవ్వకపోవడమే. ఇతర దేశాల్లో వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లు నిర్వహిస్తే ఆయా ప్రభుత్వాలు పన్ను రాయితీలను ఇస్తున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలన్నీ ఈ రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. మెగా ఈవెంట్లను శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో కలసి నిర్వహించిన సమయంలో.. ఆ రెండు దేశాలు రాయితీలు పొందుతున్నా.. బీసీసీఐకి మాత్రం భారత ప్రభుత్వం ఆ వెసులు బాటు కల్పించడం లేదు. దీని వల్ల బోర్డుకు భారీగా నష్టం వాటిల్లుతున్నది.

    Viswanathan Anand: త్వరలోనే విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్.. హీరోగా ఎవరుంటే బాగుంటుందో చెప్పిన విషి




    అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో మార్పుల కారణంగానే బీసీసీఐకి ఈ రాయితీలు అందడం లేదని ఒక అధికారి చెప్పారు. మా బోర్డు కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో మార్పు చేయాలని మేం కోరడం లేదని కూడా ఆయన అన్నారు. ఐసీసీకి ప్రధాన ఆదాయం బీసీసీఐ నుంచే అందుతున్నది. ఇప్పుడు ఐసీసీ తీసుకున్న నిర్ణయం కారణంగా ఐసీసీ రెవెన్యూ పూల్ నుంచి బీసీసీఐకి అందే మొత్తంలో ఎలాంటి తగ్గింపు ఉండదని తెలుస్తున్నది.

    Cricket News: ఛీ.. ఇంత దారుణమా..! జాత్యహంకారం కారణంగా కెరీర్‌ కోల్పోయి చనిపోవాలనుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్..



     గతంలో బీసీసీఐ పలు మార్లు కేంద్ర ప్రభుత్వంతో పన్ను రాయితీల విషయంలో చర్చలు జరిపింది. అయితే కేవలం క్రికెట్‌ కోసం మార్పులు చేయలేమని పేర్కొన్నది. నిబందనలకు అనుగుణంగా వినోదపు పన్నుతో పాటు ఇతర ట్యాక్స్‌లు చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పింది. పన్ను రాయితీల విషయంలో బీసీసీఐకి ఐసీసీ కూడా పలు మార్లు గడువు ఇచ్చింది. అయితే అది తమ పరిధి దాటి పోయిందని బీసీసీఐ స్పష్టం చేయడంతో పాటు ఎంత నష్టం వస్తుందో కూడా వివరించడంతో చివరకు ఐసీసీ దిగి రాలేక తప్పలేదు. 2024 తర్వాత బీసీసీఐ మూడు ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్నది.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, ICC, World cup

    తదుపరి వార్తలు