ఐపీఎల్‌పై బీసీసీఐ నయా ప్లాన్... దానిపైనే ఆశలు...

IPL 2020: ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని టీ20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదాపడితే… ఆ స్పేస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

news18-telugu
Updated: April 1, 2020, 1:48 PM IST
ఐపీఎల్‌పై బీసీసీఐ నయా ప్లాన్... దానిపైనే ఆశలు...
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
సమ్మర్‌లో క్రికెట్ లవర్స్‌ను ఓ రేంజ్‌లో అలరించే ఐపీఎల్ ఈసారి వాయిదా పడటం దాదాపు ఖాయమైంది. దీంతో ఈసారి ఈ టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి మొత్తం ఐపీఎల్ నిర్వహించకపోతే వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉండటంతో... బీసీసీఐ కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్, నవంబర్‌లో జరిగే టీ 20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్ర్టేలియాలో జరగాల్సిన ఈ ఈవెంట్‌పై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని టీ20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదాపడితే… ఆ స్పేస్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దాదాపు మూడు వారాల సమయం ఉంటుంది కాబట్టి లీగ్ మొత్తం లేక మినీ ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ఆస్ర్టేలియాలో అయితే ఆరునెలల పాటు లాక్డౌన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ టైమ్‌లో పరిస్థితులు చాలావరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ బోర్డర్స్ మూసివేత విషయంలో ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే ఊహించలేము. ఇలాంటి స్థితిలో ఐపీఎల్‌కు అక్టోబర్, నవంబర్ విండో సేఫ్ అని బీసీసీఐ భావిస్తోంది. అయితే టీ20 వరల్డ్ కప్ రద్దు లేదా వాయిదా పడితేనే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమవుతుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading