టీమిండియాలో లుకలుకలు...కోహ్లీ-రోహిత్ వివాదంపై బీసీసీఐ సీరియస్?

విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న కథనాలు భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై దృష్టిసారించిన బీసీసీఐ...అవసరమైతే కోహ్లీని టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పరిమితం చేసి...వన్డే సారథిగా రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

news18-telugu
Updated: July 15, 2019, 2:17 PM IST
టీమిండియాలో లుకలుకలు...కోహ్లీ-రోహిత్ వివాదంపై బీసీసీఐ సీరియస్?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • Share this:
న్యూజిలాండ్‌తో సెమీస్‌ పోరులో ఓడి భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటి నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల పరంపర కొనసాగుతోంది. సెమీస్‌లో ఓటమికి కెప్టెన్ కోహ్లీ-వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య నెలకొన్న విభేదాలే కారణమన్న కథనాలు రావడం తెలిసిందే. జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లీ వర్గం, రోహిత్ శర్మ వర్గంగా రెండుగా చీలిపోయారని, సమిష్టిగా రాణించడంలో విఫలం చెందారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ కథనాలను సీరియస్‌గా పరిగణిస్తున్న బీసీసీఐ...నిజంగానే కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయా? అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమైతే...ఆరంభ దశలోనే వాటిని పరిష్కరించడం మంచిదన్న అభిప్రాయాన్ని సీనియర్లు వ్యక్తంచేస్తున్నారు. లేనిపక్షంలో జట్టుపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని భావిస్తున్నారు. సెమీస్ నుంచి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీని తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగించాలన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని భారత జట్టు మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీని టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కొనసాగిస్తూ...రోహిత్ శర్మకు వన్డే, ట్వంటీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అంశంపై బీసీసీఐ పరిశీలన చేసే అవకాశమున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్ల టోర్నీలకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం నెలకొంటోంది. పరిమిత ఓవర్ల టోర్నీలకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమిస్తారన్న కథనాలపై క్రీడాభిమానులు రెండుగా విడిపోయారు. ఈ ప్రతిపాదనను రోహిత్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా...కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. జట్టును సెమీస్‌ వరకు తీసుకెళ్లిన విరాట్ కోహ్లీని..పరిమిత ఓవర్లకు కెప్టెన్సీగా పరిమితం చేయాలన్న ప్రతిపాదన సరికాదంటున్నారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>