• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BCCI TO BE ANNOUNCE NEW IPL 2021 SCHEDULE SOONLY MUMBAI MAY BE THE ONLY VENUE SA

IPL 2021: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో...

IPL 2021: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో పది రోజుల్లో...

ipl 2021

ఐఫీఎల్ముంబై వేదికగానే జరపాలని చూస్తోంది. ప్రస్తుతం ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి. దీంతో ఈ వేదికపై ఎలా ఉంటుందనే అనే దానిపై కసరత్తు మెుదలుపెట్టింది

  • Share this:


    ఐపీఎల్‌-14 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు బారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సన్నహాలు మెుదలుపెట్టింది. 10 రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్ తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని భావిస్తోంది. బీసీసీఐ గవర్నింగ్‌ సమావేశంలో చర్చించి ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ 2021లో పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో అ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరిగి టోర్నీ ఎప్పుడు జరుపుతుందన్న విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. కరోనా బారిన పడ్డ క్రికెటర్ల కొలుకున్న నేపథ్యంలో ఐపీఎల్‌పై ముందుకెళ్లాలని బోర్డు చూస్తోంది.

    మిగితా మ్యాచ్‌లు అన్ని ముంబై వేదికగానే జరపాలని చూస్తోంది. ప్రస్తుతం ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి. దీంతో ఈ వేదికపై ఎలా ఉంటుందనే అనే దానిపై కసరత్తు మెుదలుపెట్టింది. అలాగే ఆటగాళ్ళ బస విషయంపై కూడా బోర్డు హోటళ్లతో సంప‍్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అన్ని స్టేడియాలకు తిప్పుతూ ఆటగాళ్ళను ఇబ్బంది పెట్టే కంటే ముంబైలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియాల్లో మిగిలిన సీజన్‌ జరపడంపై దృష్టి సారించింది. ముంబైలో బాంబే జింఖానా గ్రౌండ్‌, బ్రబోర్న్‌ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ఉన్నాయి. దీంతో ఇదే సరైన వేదికగా బీసీసీఐ యోచిస్తోంది.

    టోర్నీని జూన్‌లో నిర్వహిచేందుకు బీసీసీఐ ప్లాన్ చెస్తోంది. అప్పటికి కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందని బోర్డు భావిస్తుంది. అయితే జూన్‌ 18న భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగాల్సి ఉంది. దీన్ని వాయిదా వేయాలని ఐసీసీని రిక్వెస్ట్‌ చేసి జూలై నెలకు వాయిదా వేయించాలని చూస్తోంది. చూడాలి బీసీసీఐ తను అనుకున్నది జరుగుతోందో.. లేదో..!
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు