ఆస్ట్రేలియా పర్యటనకు హైదరాబాద్ కుర్రాడు

డిసెంబర్‌లో భారత్ జట్టు.. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Updated: October 21, 2020, 8:57 AM IST
ఆస్ట్రేలియా పర్యటనకు హైదరాబాద్ కుర్రాడు
(Image:BCCI)
  • Share this:
డిసెంబర్‌లో భారత్ జట్టు.. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్ళనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ గాయాలతో బాధపడుతుండడంతో ఆస్ట్రేలియా పర్యటన సమయానికి వారు అందుబాటులో ఉంటారా లేనిది తెలియడం లేదు.  వారు స్థానంలో సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌ను అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసీస్‌తో జరిగే మూడు వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టుల కోసం సునీల్‌ జోషి నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ తర్వలోనే జట్లను ప్రకటించనుంది. భారత్‌-ఏ,ఐపీఎల్‌లో మెరుగైనా ప్రదర్శన కనబరుస్తుండడంతో సిరాజ్‌ ఆసీస్‌ టూర్‌కు ఎంపిక చేసే చాన్స్‌లు ఉన్నాయని సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు.

ఇండియా-ఎ జట్టు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ సిరాజ్‌ను సానబెట్టాడు. దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు (5/103) తీసి మెరుగైనా ప్రదర్శనను కనబరిచాడు. దక్షిణాఫ్రికా-ఎ, అఫ్గానిస్థాన్‌-ఎ, న్యూజిలాండ్‌-ఎ జట్లతో జరిగిన మ్యాచ్‌లో ఆకట్టుకున్న సిరాజ్ సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. కుడిచేతి వాటం బౌలింగ్‌తో మంచి పేస్‌ అతనిలో ఉంటుంది. అలాగే సహజసిద్ధమైన స్వింగ్‌ అతని సొంతం.

సుదీర్ఘా విరామం తర్వాత హైదరాబాద్ నుంచి ఓ ఆటగాడు టీమిండియా నుంచి ప్రతినిథ్యం వహించే అవకాశం కనిపిస్తుంది.  1994 లో జన్మించిన  మహమ్మద్ సిరాజ్  అండర్‌-23 రంజీ, భారత్‌-ఏ,ఐపీఎల్‌‌లో మంచి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రంజీ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన సిరాజ్‌ను 2017 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.2.6 కోట్లకు కొనుగొలు చేసింది. 2018 జరిగిన వేళంలో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది

అక్టోబర్ 2017 లో న్యూజిలాండ్‌తో జరిగిన భారత ట్వంటీ 20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. కీవిస్ జరిగిన టి 20 మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అతను ,కేన్ విలియమ్సన్ వికెట్ తీసుకున్నాడు, నాలుగు ఓవర్లు వేసి 53 పరుగుల ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 2019లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ODIలో అరంగేట్రం చేశాడు.
Published by: Rekulapally Saichand
First published: October 21, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading