టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి.. బీసీసీఐ అధికారిక ప్రకటన

BCCI Head Coach | భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

news18-telugu
Updated: August 16, 2019, 6:58 PM IST
టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి.. బీసీసీఐ అధికారిక ప్రకటన
రవిశాస్త్రి, కోహ్లీ (ఫైల్ చిత్రం)
  • Share this:
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.  ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడినే కొనసాగిస్తూ క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కపిల్ దేవ్ నేతృత్వంలో సీఏసీ సమావేశం నిర్వహించింది. ముంబైలోని బీసీసీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి ఈ కమిటీ సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి కూడా హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐలో పనిచేసేందుకు, టీమిండియా హెడ్ కోచ్ పదవికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సుమారు 2వేల దరఖాస్తులు వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, తీవ్ర వడపోతల తర్వాత సీఏసీ ముగ్గురిని ఫైనల్ చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితోపాటు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మైక్ హెసన్, ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ లిస్టులో ఉన్నారు. వీరితో పాటు టీమిండియా మాజీ ఆటగాళ్లు లాల్ చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్ కూడా రేసులో నిలిచారు. అయితే, చివరకు కపిల్ దేవ్ టీమ్ మాత్రం రవిశాస్త్రికే ఓటేసింది.

2017 నుంచి రవిశాస్త్రి భారత జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా నియిమకంతో 2021 టీ 20 వరల్డ్ కప్ వరకు కూడా రవిశాస్త్రికి తిరుగులేదు. రవిశాస్త్రికి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు బలంగా ఉంది. దీంతో కపిల్ దేవ్ బృందం కూడా కెప్టెన్ మాట వినాల్సి వచ్చినట్టు కనిపిస్తోంది. 2007లో భారత జట్టు మేనేజర్‌గా రవిశాస్త్రి నియమితులయ్యాడు. ఆ తర్వాత 2014 నుంచి 2017 వరకు టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2017 నుంచి ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. 1981 - 92 మధ్య టీమిండియాకు రవిశాస్త్రి ఆడాడు. 80 టెస్టుల్లో 3830 పరుగులు చేసి, 151 వికెట్లు తీశాడు. 150 వన్డేల్లో 3108 పరుగులు చేసి, 129 వికెట్లు పడగొట్టాడు.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు