Home /News /sports /

BCCI SHARED A VIDEO IN THAT PANDYA BROTHERS FACE OFF IN GYM CHALLENGE WHICH GOES VIRAL SRD

Viral Video : జిమ్ లో పాండ్యా బ్రదర్స్ మధ్య బస్తి మే సవాల్ .. గెలుపెవరిదో తెలుసా..?

Photo Credit : BCCI Twitter

Photo Credit : BCCI Twitter

Viral Video : టీమిండియా బ్రదర్స్..హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఈ ఇద్దరూ అన్నదమ్ములు ఎక్కడుంటే అక్కడా ఎనర్జీ ఉన్నట్టే. గ్రౌండ్ లోపల, బయటా వీరిద్దరి చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్థుల్ని కవ్వించడంలో అన్నదమ్ములు ఎప్పుడూ ముందుంటారు.

ఇంకా చదవండి ...
    టీమిండియా బ్రదర్స్..హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఈ ఇద్దరూ అన్నదమ్ములు ఎక్కడుంటే అక్కడా ఎనర్జీ ఉన్నట్టే. గ్రౌండ్ లోపల, బయటా వీరిద్దరి చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రత్యర్థుల్ని కవ్వించడంలో అన్నదమ్ములు ఎప్పుడూ ముందుంటారు. అలాగే, ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాళ్లు విసురుతారు. అయితే, లేటెస్ట్ గా ఈ పాండ్యా బ్రదర్స్ ఒకరిపై మరొకరు సవాల్ విసురుకున్నారు. అవునండీ మీరు వింటున్నది నిజమే. లేటెస్ట్ గా హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా తాజాగా పోటీపడ్డారు. వీరిద్దరూ జిమ్‌లో కసరత్తులు చేసి ఒకరిపై ఒకరు గెలవాలనుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకొంది. " ఇది చూడటానికి తేలికగా ఉన్నా అంత సులభం కాదు. ఈ సవాళ్లను ఇంట్లో ప్రయత్నించాలంటే జాగ్రత్త వహించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది బీసీసీఐ. పాండ్యా బ్రదర్స్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారిద్దరూ జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ హర్ష ఆధ్వర్యంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తం మూడు విభాగాల్లో వీరిద్దరూ పోటీపడ్డారు.

    అందులో ఫస్ట్ గోడకుర్చీ వేయగా కృనాల్‌ పాండ్య విజేతగా నిలిచాడు. ఇక రెండో దాంట్లో గ్లూట్‌ బ్రిడ్జ్‌ ఎక్సర్‌సైజ్‌ (నేలపై పడుకొని నడుము నుంచి కాళ్ల వరకు గాలిలో ఉంచడం)లో హార్దిక్‌ గెలుపొందాడు. దీంతో ఇద్దరూ సమానంగా నిలిచారు. ఇక, చివరికి మూడో దాంట్లో స్ల్పిట్‌ స్క్వాట్‌ హోల్డ్‌ (ఒక కాలును వెనక్కి పెట్టి మరో కాలును ముందుకు వంగి నిల్చోవడం) చేశారు. ఇందులో ఇద్దరూ సమానంగా నిలిచారు. చివరికి.. ఈ పోటీలో అన్నదమ్ములిద్దరూ విజేతలుగా నిలిచారు.


    మరోవైపు, శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగండంతో వన్డే సిరీస్ ఈ నెల 13 నుంచి 18 కి ఐదు రోజుల పాటు వాయిదా పడింది. ఆపై టీ20 సిరీస్‌ కూడా 21 నుంచి 25కు రీషెడ్యూల్‌ అయింది. ఇక, శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియా.. ఈ సిరీస్ లో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది. అందు కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది గబ్బర్ సేన. ఈ సిరీస్ లో సత్తా చాటి మొయిన్ స్ట్రీమ్ జట్టులో ఎంపిక అవ్వాలని కుర్రాళ్లు తహతహలాడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Hardik Pandya, India vs srilanka, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు