హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2020: ఐపీఎల్‌కు కొత్త పార్ట్‌నర్ ఇదే, మూడు సీజన్ల వరకు

IPL 2020: ఐపీఎల్‌కు కొత్త పార్ట్‌నర్ ఇదే, మూడు సీజన్ల వరకు

క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుదల కానుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు.

క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ రేపు విడుదల కానుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా ప్రకటించారు.

‘Unacademyని ఐపీఎల్ అధికారిక పార్ట్‌నర్‌గా స్వాగతం పలుకుతున్నాం. ఐపీఎల్ 2020 నుంచి 2022 వరకు Unacademy పార్ట్‌నర్‌గా కొనసాగుతుంది.’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు.

IPL New Partner: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కొత్త పార్ట్‌నర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. బెంగళూరుకు చెందిన ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ Unacademy ని ఐపీఎల్ అధికారిక పార్ట్‌నర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2020 (సీజన్ 13) యూఏఈలో జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరగనుంది. ‘Unacademyని ఐపీఎల్ అధికారిక పార్ట్‌నర్‌గా స్వాగతం పలుకుతున్నాం. ఐపీఎల్ 2020 నుంచి 2022 వరకు Unacademy పార్ట్‌నర్‌గా కొనసాగుతుంది.’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐపీఎల్ అనేది భారత్‌లో అత్యధికులు చూసే క్రీడా వినోదం. అలాగే, భారత్‌లో అభివృద్ది చేసిన ఎడ్యుటెక్ దిగ్గజం Unacademy ఇందులో భాగస్వామ్యం కావడం వల్ల కొన్ని కోట్ల మంది టీవీ చూసే ప్రేక్షకుల్లో పాజిటివ్ దృక్పథాన్ని తీసుకురాగలదు. కెరీర్‌ కోసం చూస్తున్న కొన్ని కోట్ల మంది భారతీయ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ’అని బ్రిజేష్ పటేల్ తెలిపారు. మరోవైపు దీనిపై  Unacademy వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) కరణ్ ష్రాఫ్ మాట్లాడుతూ ఐపీఎల్ పార్ట్‌నర్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.  Unacademy విద్యావిధానంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిందన్నారు. అటు నేర్చుకోవాలనుకునే వారికి, ఇటు నేర్పే వారికి కూడా ఇది గొప్ప మాధ్యమంగా మారిందన్నారు. ఐపీఎల్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా భారత్‌‌లో  Unacademy రెండింతల వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, ఐపీఎల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అంతకు ముందు బీసీసీఐ ఫ్యాంటసీ గేమింగ్ సంస్థ Dream 11ను ఐపీఎల్ 2020కి టైటిల్ స్పాన్సర్‌గా ఎంపిక చేసింది. చైనీస్ కంపెనీ వీవోను తప్పించి Dream 11ను ఎంపిక చేసింది. టైటిల్ స్పాన్సర్‌షిప్ విషయంలో కూడా Unacademy, BYJU లాంటి సంస్థలతో పోటీ పడి  Dream 11 సంస్థ రూ.222 కోట్లు పెట్టి స్పాన్సర్‌ షిప్ దక్కించుకుంది. నాలుగు నెలల 13 రోజుల కోసం  Dream 11 ఆ మొత్తాన్ని చెల్లించింది.

First published:

Tags: Bcci, IPL, IPL 2020

ఉత్తమ కథలు