టీమ్ ఇండియా (Team India) వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని (Virat Kohli) తప్పించి రోహిత్ శర్మకు (Rohit Sharma) ఆ బాధ్యతలు కట్టబెట్టారు. దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour) నుంచే రోహిత్ శర్మ కెప్టెన్సీ అమలులోకి వస్తుందని జాతీయ సీనియర్ సెలెక్టర్లు (Senior Selectors) ప్రకటించారు. ఇకపై వైట్ బాల్ కెప్టెన్సీ రోహిత్ శర్మ, టెస్టు కెప్టెన్సీ విరాట్ కోహ్లీ నిర్వహిస్తారని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల పాటు సాగిన సెలెక్టర్ల సమావేశం చివరకు కోహ్లీని తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్డేల్లో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉందని అన్నాడు. కేవలం ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడమే కోహ్లీ చేసిన నేరమా అని వాళ్లు నిలదీస్తున్నారు. కపిల్ దేవ్, ధోనీ తప్ప ఇప్పటి వరకు ఏ కెప్టెన్ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదనే విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. స్వయంగా క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి కూడా కోహ్లీ విషయంలో అన్యాయం చేశాడని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, గంగూలీపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో గంగూలీ అసలు ఏం జరిగిందనే విషయంపై నోరు విప్పారు.
వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం చాలా గందరగోళానికి దారి తీస్తుందని సెలెక్టర్లు భావించినట్లు గంగూలీ చెప్పాడు. యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ జరగడానికి ముందే విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేశాడు. ఆ సమయంలోనే సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లీని నచ్చచెప్పడానికి ప్రయత్నించినట్లు గంగూలీ వెల్లడించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని.. జట్టులో గందరగోళం ఏర్పడుతుందని బీసీసీఐ అతడికి వివరించినట్లు చెప్పాడు. అతడిని ఎంత బతిమిలాడినా అసలు ఒప్పుకోలేదని.. దీంతో సెలెక్టర్లు తమ నిర్ణయం తాము తీసుకున్నారని గంగూలీ అన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్ల పద్దతి ఎక్కడా లేదని గంగూలీ చెప్పాడు. సెలెక్టర్లు కూడా కోహ్లీని రెడ్ బాల్ క్రికెట్‌కు పరిమితం చేయడానికి ఇదే కారణమని గంగూలీ వివరించాడు.
Google Search: ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్‌దే అగ్రస్థానం.. టాప్ 10 సెర్చ్‌లలో ఏమున్నాయంటే..!
బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కూడా కోహ్లీతో మాట్లాడి చూశానని.. వ్యక్తిగతంలో ఉన్న సమస్యలను కూడా చర్చించానని గంగూలీ చెప్పుకొచ్చాడు. అయితే అంతిమంగా కోహ్లీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడానికి నిరాకరించినట్లు చెప్పాడు. కాగా, టీమ్ ఇండియాకు కోహ్లీ చేసిన సేవలకు గంగూలీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్‌గా కోహ్లీ చాలా సాధించాడని గంగూలీ అన్నాడు. ఇకపై కూడా ఆటగాడిగా జట్టుతో కోహ్లీ ఉండటం లాభించే విషయం అని అన్నాడు.
కొత్తగా పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఉన్నదని గంగూలీ అన్నాడు. భారత క్రికెట్ ఇద్దరు మంచి కెప్టెన్ల చేతిలో ఉన్నదని గంగూలీ అన్నాడు. భవిష్యత్‌లో టీమ్ ఇండియా మరింతగా రాణిస్తుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Rohit sharma, Sourav Ganguly, Team India, Virat kohli