గంగూలీపై కరోనా ప్రభావం.. హోమ్‌ క్వారెంటైన్‌లోకి దాదా?

తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఫ్యామీలిని కూడా కరోనా వదలలేదు. దాదా సోదరుడైనా స్నేహశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గంగూలీ హోమ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లారు.

Rekulapally Saichand
Updated: July 16, 2020, 2:21 PM IST
గంగూలీపై కరోనా ప్రభావం.. హోమ్‌ క్వారెంటైన్‌లోకి  దాదా?
సౌరవ్ గంగూలీ స్టెప్పులు
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలకూతలం చేస్తోంది. వేగంగా పరిగేడుతున్న మనిషి జీవితానికి ఒక్కసారిగా బ్రేకులు వేసింది. ముఖ్యంగా క్రీడా రంగంపై పేను ప్రభావాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్ల్ ఇప్పటికే వాయిదా పడ్డాయి. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఫ్యామీలిని కూడా కరోనా వదలలేదు. దాదా సోదరుడైనా స్నేహశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో గంగూలీ హోమ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. కొద్ది రోజులుగా స్నేహశీష్‌ జ్వరంతో బాధపడుతున్నాడు దీంతో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతనిని బెల్లీ వ్యూ ఆస్పత్రిలో చేర్పించారు.

సోదరుడికి కరోనా సోకడంతో గంగూలీ సైతం కొద్ది రోజులు గృహ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం స్నేహశీష్‌ భార్య.. గంగూలీ ఇంటికి వచ్చి వెళ్ళారు. స్నేహశీష్‌ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా ఉన్నారు. అలాగే సౌరవ్‌కు చెందిన పలు వ్యాపార వ్యవహారాలను కూడా అతనే చూసుకుంటున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: July 16, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading