BCCI PRESIDENT SOURAV GANGULY UNDERWENT ANOTHER ROUND OF ANGIOPLASTY IMPLANT TWO MORE STENTS BA
Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి మరోసారి యాంజియో ప్లాస్టీ... మరో రెండు స్టెంట్లు
Sourav Ganguly
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Saurav Ganguly)కి మరోసారి ఆపరేషన్ జరిగింది. గంగూలీకి ఆంజియోప్లాస్టీ నిర్వహించారు. దాదాకు ప్రస్తుతం ఉన్న స్టెంట్లకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు.
బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Saurav Ganguly)కి మరోసారి ఆపరేషన్ జరిగింది. గంగూలీకి ఆంజియోప్లాస్టీ నిర్వహించారు. దాదాకు ప్రస్తుతం ఉన్న స్టెంట్లకు అదనంగా మరో రెండు స్టెంట్లు వేశారు వైద్యులు. ప్రస్తుతం రక్తనాళాల్లో ఉన్న బ్లాకేజీని క్లియర్ చేయడానికి స్టెంట్లు వేశారు. సౌరవ్ గంగూలీకి రెండోసారి ఛాతీలో నొప్పి రావడంతో నిన్న కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆ రిపోర్టులను పరిశీలించి యాంజియో ప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గుండె రక్త నాళాల్లో బ్లాక్ కావడంతో రెండు స్టెంట్లు వేశారు. నిన్న గంగూలీకి పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
గంగూలీ ఆరోగ్యంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్వీట్ చేశారు. ‘గంగూలీ ఆరోగ్యం గురించి ఓ అప్ డేట్ వచ్చింది. కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరిగింది. డాక్టర్లు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గంగూలీ ఆరోగ్యం బావుంది. దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.’ అంటూ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్వీట్ చేశారు.
Got an update on health of @SGanguly99 Sourav Ganguly, President Board of Control for Cricket in India @BCCI under treatment at Apollo Hospital in Kolkata. As per doctors and family members his condition is fine. Wishing Dada speedy recovery and early return to normalcy.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) January 28, 2021
ఇటీవలే గంగూలీకి హార్ట్ సర్జరీ చేశారు. ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించిందని డాక్టర్లు తెలిపారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు స్టెంట్ వేశారు. జనవరి 7న డిశ్చార్జి సమయంలో సౌరవ్ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక అభిమానులకు అభివాదం చేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. గుండెలో స్టెంట్ ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఐతే అంతలోనే ఆయనకు మరోసారి ఛాతీనొప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో గంగూలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.