Home /News /sports /

BCCI PRESIDENT SOURAV GANGULY TAGS THE WRONG SUNIL CHHETRI IN HIS CONGRATULATORY TWEET HERES HOW NETIZENS REACTED SRD

Sourav Ganguly : పప్పులో కాలేసిన దాదా.. టీమిండియా కెప్టెన్ కి బదులు నేపాల్ కుర్రాడికి ప్రశంసలు..!

సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)

సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫోటో)

Sourav Ganguly : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (BCCI President Sourav Ganguly) పప్పులో కాలేశాడు. టీమిండియా (Team India) కెప్టెన్ కు బదులు నేపాల్ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురింపించాడు.

    బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (BCCI President Sourav Ganguly) పప్పులో కాలేశాడు. టీమిండియా (Team India) కెప్టెన్ కు బదులు నేపాల్ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురింపించాడు. వివరాల్లోకెళితే.. భారత ఫుట్‌బాల్‌ జట్టు (Indian Football Team) ఆసియాకప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఉలెన్‌బాటర్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ బీ మ్యాచ్‌లో పాలస్తీనా 4-0తో ఫిలిప్పిన్స్‌ను ఓడించడంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ ఖరారు అయ్యింది. తాజా ఫలితంతో గ్రూప్ బి టాపర్‌గా పాలస్తీనా నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. నాలుగు పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచిన ఫిలిప్పిన్స్ ఇంటి ముఖం పట్టింది.

    ఓవరాల్‌గా ఆసియాకప్‌ (Asia Cup)కు భారత్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 1964, 1984, 2011, 2019లో అర్హత సాధించింది. అయితే 2019 టోర్నీలో గ్రూప్ దశలోనే వైదొలిగింది. మొత్తం 24 జట్లు పాల్గొన్న క్వాలిఫయింగ్ రౌండ్‌ను మూడు ప్రదేశాల్లో నిర్వహించారు. ఇందులో గ్రూప్ డి మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది.

    మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 4-0తో హాంకాంగ్‌పై విజయం సాధించింది.హాంకాంగ్‌ను చిత్తు చేసిన భారత్‌ 9 పాయింట్లతో గ్రూప్‌-డి టాపర్‌గా ముందంజ వేసింది. అన్వర్‌ అలీ (2వ), సునీల్‌ ఛెత్రి (45వ), మన్వీర్‌ సింగ్‌ (85వ), (90+3వ) ఇషాన్‌ భారత్‌ తరఫున గోల్స్‌ కొట్టారు. భారత్‌ వరుసగా రెండోసారి ఆసియాకప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి.

    గంగూలీ తప్పుగా ట్యాగ్ చేసిన ట్వీట్ (Twitter)


    ఇక, టీమిండియా అద్భుత ప్రదర్శన సందర్భంగా సౌరవ్ గంగూలీ ట్విట్టర్ లో స్పెషల్ ట్వీట్ చేస్తూ సునీల్ చెత్రిని ప్రశంసించబోయి తప్పు చేశారు. 'ఇండియన్ ఫుట్‌బాల్ 2023 AFC ఆసియా కప్ కు అర్హత సాధించి గొప్ప పనిచేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆధ్వర్యంలో జట్టు గొప్ప పని చేసింది. చక్కటి ప్రదర్శన కనబరిచింది. అంతటి అభిమానుల సందడి మధ్య ఆ ప్రదేశంలో ఘనత సాధించారు' అని గంగూలీ ట్వీట్ చేశాడు.


    అయితే, ఇక్కడే దాదా పప్పులో కాలేశాడు. సునీల్ చెత్రిని ట్యాగ్ చేయబోయి తప్పుగా.. సునీల్ అనే నేపాల్ కి చెందిన మరో వ్యక్తికి ట్యాగ్ చేశాడు. దీంతో.. ఫ్యాన్స్ గంగూలీ చేసిన తప్పును ఎత్తి చూపారు. మరోవైపు నేపాల్ వ్యక్తి.. సౌరవ్ ఇది సునీల్ చెత్రి కాదు.. నేపాల్ సునీల్ అంటూ రిప్లై ఇవ్వడం గమనర్హం. ఇక, గంగూలీకి ఫుట్ బాల్ క్రీడ అంటే ఎంతో ఇష్టం. క్రికెట్ తర్వాత ఫుట్ బాల్ నే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాడు దాదా. ఐఎస్ఎల్ లో కూడా దాదా ఓ టీం ఓనర్ గా కూడా ఉన్నాడు. అట్లాంటికో డి కోల్ కతా జట్టుకు సహ యజమానిగా గంగూలీ ఉన్న సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Football, Sourav Ganguly, Team India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు