Home /News /sports /

BCCI PRESIDENT SOURAV GANGULY SOME INTERESTING COMMENTS ON INDIA VS PAKISTAN BILATERAL SERIES SRD

Sourav Ganguly : " మాకు అంత సీన్ లేదు.. ఆ నిర్ణయం మోదీ - ఇమ్రాన్ ఖాన్ లు తీసుకోవాల్సిందే.. "

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly : సాధారణంగా టీమిండియా.. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఆహ్వానిస్తుంటుంది.

    నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి పోరు కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఐసీసీ మెగా ట్రోఫీలు కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఇరు దేశాల ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ ఈ మధ్యలో జరగడం అసంభవమే. సాధారణంగా టీమిండియా.. క్రికెట్ ఆడే దేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ఆహ్వానిస్తుంటుంది. పాకిస్తాన్‌తో మాత్రం అది సాధ్యపడేది కాదు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కాశ్మీర్ సమస్య.. వంటి అంతర్జాతీయ స్థాయి సమస్యలు ఈ రెండు దేశాల మధ్య బ్రేకులు వేస్తున్నాయ్.

    అందుకే భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ అనేది అస్సలు కుదిరేది కాదు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లల్లో తప్ప ఈ రెండు దేశాల జట్లు పరస్పరం పర్యటనలకు వెళ్లడం అనేది క్రికెట్ బోర్డుల చేతుల్లో లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సైతం స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాలనే నిర్ణయం తమ చేతుల్లో లేదని తెలిపారు. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా కూడా ఈ విషయంలో ఏం చేయలేరని తేల్చిచెప్పారు గంగూలీ.

    భారత్ - పాక్ సిరీస్ పై నిర్ణయం తీసుకోవాల్సింది.. రెండు దేశాల ప్రభుత్వాలేనని చెప్పాడు. రెండు దేశాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడుతుందని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ స్తంభించిపోయి ఎన్నో సంవత్సరాలైందని, దాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు నిర్యం తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు.

    ఇది కూడా చదవండి : మెగా వేలంలో ఆ పది మంది భారత కుర్రాళ్లకు భారీ డిమాండ్..10 కోట్ల రూపాయలు పక్కా..

    ఇక, ఈ మెగా టోర్నీలో టీమిండియాతో జరిగిన మ్యాచులో పాకిస్తాన్‌ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు బాబర్‌ అజమ్‌(68 పరుగులు, 52 బంతులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ రిజ్వాన్‌( 79 పరుగులు, 55 బంతులు; 6 ఫోర్లు, 3 సిక్సర్లు)లు కలిసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 152 పరుగులు కొట్టి పాకిస్తాన్‌కు ఘన విజయాన్ని అందించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Imran khan, India VS Pakistan, PM Narendra Modi, Sourav Ganguly, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు