Home /News /sports /

BCCI PRESIDENT SOURAV GANGULY IS SET TO BE DISCHARGED FROM THE HOSPITAL TODAY

నిలకడగా గంగూలీ ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ చేసే అవకాశం

Sourav Ganguly

Sourav Ganguly

గంగూలీకి ఆంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు అదనంగా మరో రెండు స్టెంట్లు వేసినట్లు తెలిసింది. ధమనుల్లోని పూడికలను క్లియర్ చేసేందుకు గురువారం ఈ రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యలు తెలిపారు. గంగూలీకి రెండోసారి ఛాతిలో నొప్పి రావడంతో ...

ఇంకా చదవండి ...
    కోల్‌కత్తా: బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్య పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తే గంగూలీని శనివారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. గంగూలీకి ఆంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు అదనంగా మరో రెండు స్టెంట్లు వేసినట్లు తెలిసింది. ధమనుల్లోని పూడికలను క్లియర్ చేసేందుకు గురువారం ఈ రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యలు తెలిపారు. గంగూలీకి రెండోసారి ఛాతిలో నొప్పి రావడంతో బుధవారం ఆయన కోల్‌కత్తాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

    జనవరి తొలి వారంలో గంగూలీ తన స్వగృహంలో వ్యాయామం చేస్తుండగా ఉన్నట్టుండి స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో.. ఆయన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయన రక్త నాళాల్లో మూడు చోట్ల రంధ్రాలు ఉన్నట్లు తేల్చారు. ఆ తర్వాత యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టంట్ వేశారు. ఆరోగ్యం కుదుటపడిన ఆరు రోజుల అనంతరం గంగూలీని డిశ్చార్జ్ చేశారు. బుధవారం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గంగూలీని అపోలోకు తరలించారు.

    ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదని, శుక్రవారం రాత్రి కూడా గంగూలీ ప్రశాంతంగా నిద్రించారని, శనివారం ఉదయం అల్పాహారం కూడా తీసుకున్నారని వైద్యులు తెలిపారు. డాక్టర్ అశ్విన్ మెహతా, అఫ్తాబ్ ఖాన్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గంగూలీ కుటుంబానికి గుండెపోటు సమస్య మొదటి నుంచి వెంటాడుతోంది. గంగూలీ సోదరుడు స్నేహశీష్ కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్యులు ఒక స్టెంట్ కూడా వేశారు. గంగూలీ తొలుత ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే స్నేహశీష్ కూడా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు బయటపడింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bcci, Ganguly, Hospital, Kolkata

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు