Home /News /sports /

BCCI PRESIDENT SOURAV GANGULY HAS BEEN HOSPITALISED AGAIN SK

Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతీ నొప్పి.. ఆస్పత్రికి తరలింపు

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly: ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు.

    బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సౌరవ్ గంగూలీ ఇటీవలే ఓసారి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. జనవరి 2న ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా స్వల్ప గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. అదే రోజున ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. 13 మంది సభ్యుల డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు.



    ఇటీవలే గంగూలీకి హార్ట్ సర్జరీ చేశారు. ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించిందని డాక్టర్లు తెలిపారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు స్టెంట్ వేశారు. జనవరి 7న డిశ్చార్జి సమయంలో సౌరవ్ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక అభిమానులకు అభివాదం చేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. గుండె‌లో స్టెంట్ ఉండడంతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఐతే అంతలోనే ఆయనకు మరోసారి ఛాతీనొప్పి వచ్చింది. ఈ నేపథ్యంలో గంగూలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bcci, Cricket, Kolkata, Sourav Ganguly, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు