హోమ్ /వార్తలు /క్రీడలు /

Viral Video : దాదా.. దాదా రాజ్.. నీ యవ్వ తగ్గేదే లే.. గంగూలీని తాకిన పుష్ప ఫీవర్..

Viral Video : దాదా.. దాదా రాజ్.. నీ యవ్వ తగ్గేదే లే.. గంగూలీని తాకిన పుష్ప ఫీవర్..

Sourav Ganguly (PC : Twitter)

Sourav Ganguly (PC : Twitter)

Viral Video : క్రికెటర్లని కూడా పుష్ప మేనియా వదల్లేదు. భారత క్రికెటర్లతో పాటు ప్రపంచ క్రికెటర్లు చాలా మంది ఈ స్టెప్పులను వేసి వారి అభిమానులను అలరించారు. లేటెస్ట్ గా దాదా కూడా ఈ లిస్ట్ లో చేరాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప సినిమా (Pushpa Movie) ఎంతటి విజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. బన్నీ నటించిన సినిమాలు గతంలో మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ మూవీలోని పాటలకు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ అందించి సంగీతం సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా శ్రీవల్లి పాట సోషల్ మీడియా (Social Media)లో నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ పాటకు భారీ వ్యూస్ దక్కాయి.

అయితే ఈ పాటను చాలా మంది తమ స్టైల్ లోపాడటం.. లేదా ఈ పాటలోని హుక్ స్టెప్పును అనువదించడం వంటివి చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. క్రికెటర్లని కూడా పుష్ప మేనియా వదల్లేదు. భారత క్రికెటర్లతో పాటు ప్రపంచ క్రికెటర్లు చాలా మంది ఈ స్టెప్పులను వేసి వారి అభిమానులను అలరించారు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సురేష్ రైనా, రవీంద్రజడేజా, డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రావో వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కూడా పుష్ప ఫీవర్ తాకింది.

బెంగాళీలో దాదా హోస్ట్ గా వస్తున్న ‘దాదాగిరి అన్లిమిటెడ్’ షో లో గంగూలీ పుష్ప స్టెప్పులను వేశాడు. జీ బంగ్లాలో ప్రసారమవుతున్న (వెస్ట్ బెంగాల్) ఈ షో లో చిన్న పిల్లలతో కలిసి దాదా షో చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ విడుదల చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. గంగూలీ ఓ అబ్బాయిని నీ పేరేమిటి అని అడగగా అతడు ‘పుష్ప’ అని సమాధానమిచ్చాడు. అనంతరం ‘చూపే బంగారమాయేనే’ పాటకు ఆ బుడ్డోడు స్టెప్పులేయడమే గాక గంగూలీతో కూడా వేయించాడు. ఈ సందర్భంగా గంగూలీ... ‘తగ్గేదేలే’ ను కూడా ఇమిటేట్ చేశాడు.

ఇక, ఐపీఎల్-15 సీజన్ సన్నాహకాల్లో గంగూలీ తలమునకలై ఉన్నాడు. ఈనెల 26న చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగబోయే మ్యాచుకు అతడు హాజరయ్యే అవకాశముంది. ప్రతిష్టాత్మక వాంఖెడే ప్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

First published:

Tags: Bcci, IPL 2022, Pushpa Movie, Sourav Ganguly, Viral Video

ఉత్తమ కథలు