కోహ్లీ, ధోనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు..

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా భవిష్యత్తు కోసం తాను తీసుకోబోయే నిర్ణయాలను మీడియాకు వెల్లడించాడు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడారు.

news18-telugu
Updated: October 23, 2019, 5:38 PM IST
కోహ్లీ, ధోనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు..
గంగూలీ, ధోని, కోహ్లీ
  • Share this:
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా భవిష్యత్తు కోసం తాను తీసుకోబోయే నిర్ణయాలను మీడియాకు వెల్లడించాడు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడారు. కోహ్లీతో కలిసి టీమిండియా గెలుపు కోసం తీసుకోబోయే నిర్ణయాలను వివరించాడు. తన రిటైర్మెంట్‌పై ధోని తీసుకునే నిర్ణయంపైనా గంగూలీ కామెంట్ చేశాడు. ‘భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతడికి కావాల్సిన మద్దతును పూర్తి స్థాయిలో అందిస్తా. రేపే కోహ్లీతో మాట్లాడతా. టీమిండియాను ప్రపంచంలోనే పటిష్ఠ స్థితిలో ఉంచేందుకు కోహ్లీ కృషి చేస్తున్నాడు. దానికి నా వంతు మద్దతు కచ్చితంగా ఉంటుంది’ అని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియా గొప్ప స్థానంలో ఉందని, గత మూడు, నాలుగేళ్లుగా జట్టు ఆట ఆడుతున్న తీరు అద్భుతమని వెల్లడించాడు. ఇక, జట్టు క్రెడిబిలిటీ, నీతివంతమైన పాలన, సమానత్వంలో రాజీ పడే ప్రస్తకే లేదని గంగూలీ స్పష్టం చేశాడు. తాను ఇండియా క్రికెట్‌ను ఏవిధంగా నడిపించానో.. ఇప్పుడూ అలాగే నడిపిస్తానని పేర్కొన్నాడు.

తాను, జగన్మోహన్ దాల్మియా ఎలాంటి సంబంధాలను కొనసాగించామో.. అలాంటి సంబంధాలే తనకు, కోహ్లీకి మధ్య ఉన్నాయని.. కెప్టెన్‌గా ఉన్నపుడు తనకు దక్కిన మద్దతునే ఇప్పుడూ కొనసాగిస్తానని బీసీసీఐ బాస్ తెలిపాడు. ఇదిలా ఉండగా.. ధోని భవితవ్యంపైనా గంగూలీ స్పందించాడు. క్రికెట్‌లో గొప్ప వ్యక్తుల్లో ధోనీ ఒకడని, అతడు ఆటలో కొనసాగుతున్నంత సేపు అతడికి గౌరవం ఉంటుందని తెలిపాడు. ‘రిటైర్మెంట్ అనేది ధోని తీసుకునే నిర్ణయం. అది అతడి వ్యక్తిగతం. అతడి మనసులో ఏముందో నాకు తెలీదు. అయితే, ధోనిని చూసి యావత్తు దేశం గర్విస్తోంది. అతడు సాధించిన విజయాలు, ఇతరత్రా వావ్ అనిపిస్తాయి. నేను ఉన్నంతసేపు అందరికీ గౌరవం లభిస్తుంది. అందులో ఎలాంటి భేషజాలు లేవు’ అని తేల్చిచెప్పాడు.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading