ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) ఉన్న టీమ్ ఇండియాలో (Team India) కరోనా (Corona) కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్మాన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కరోనా బారిన పడి గత ఎనిమిది రోజులుగా ఒక ప్రత్యేక ప్రదేశంలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. రిషభ్ పంత్‌తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్‌గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే దయానంద్‌కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ముగ్గురు కరోనా నెగటివ్‌గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు పంపారు. దీంతో, టీమిండియాకు చెందిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం లండన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక 20 రోజుల విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హమ్ బయలుదేరారు.
అయితే టీమిండియా ఆటగాళ్లకు 20 రోజుల విశ్రాంతి ఇవ్వడంతోనే కరోనా బారిన పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిక్కిరిసిన అభిమానుల మధ్య యూరో కప్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లినందుకే పంత్‌కు వైరస్ సోకి ఉండవచ్చని, అతను మాస్క్ కూడా ధరించలేదని కొందరు విమర్శించారు.
కానీ రిషభ్ పంత్ లండన్‌లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడని, అక్కడే వైరస్ సోకి ఉండవచ్చని టీమ్ వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. " జూలై 5, 6 తేదీల్లో రిషభ్ పంత్ లండన్‌లోని ఓ దంత వైద్యుడిని సంప్రదించాడు. అక్కడే అతనికి వైరస్ అటాక్ అయ్యి ఉండొవచ్చు." అని టీమ్‌కు చెందిన ఓ అధికారి తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Corona effect, Cricket, Rishabh Pant, Sourav Ganguly