BCCI POSTPONES RANJI TROPHY AND OTHER DOMESTIC CRICKET TOURNEY AMID COVID 19 OMICRON SURGE MKS
cricketపై మళ్లీ covid పిడుగు: BCCI సంచలన నిర్ణయం.. మేజర్ టోర్నీలు వాయిదా..
బీసీసీఐ సెక్రటరీ జై షా
కరోనా వైరస్ మహమ్మారి మరోసారి క్రికెట్ ప్రధాన టోర్నమెంట్ల వాయిదాకు కారణమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం నాడు ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఏమని ప్రకటన చేశారంటే..
భారతీయుల ఆరాధ్య క్రీడ క్రికెట్ పై మరోసారి కరోనా పిడుగు పడింది. గడిచిన రెండేళ్లలో ఆటను తీవ్రంగా ప్రభావితం చేసిన మహమ్మారి ఇప్పుడు కూడా ప్రధాన టోర్నమెంట్ల వాయిదాకు కారణమైంది. దేశంలో కరోనా కేసులు వెల్లువలా వస్తుండటం, పదుల కొద్దీ రాష్ట్రాలు దాదాపు లాక్ డౌన్ విధించడం, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం జడలు విప్పుతోన్న క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది సేపటి కిందటే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది..
కరోనా వెల్లువ నేపథ్యంలో దేశంలో జరగాల్సిన దాదాపు అన్ని ప్రధాన దేశవాళీ టోర్నమెంట్లను బీసీసీఐ వాయిదా వేసింది. జనవరి 13న ప్రారంభం కావాల్సిన రంజీ ట్రోఫీ -2022తోపాటు సీకే నాయుడు ట్రోఫీ, మహిళల టీ20 లీగ్లను బీసీసీఐ వాయిదా వేసింది. ఈ మేరకు క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడైన జై షా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రంజీ సీజన్-2022 ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, పశ్చిమ బెంగాల్ జట్టులో ఏకంగా ఏడుగురు, ముంబై జట్టులో ఇద్దరు సభ్యులు కరోనా బారిన పడిన పడ్డారు. మ్యాచ్ లు జరిగే ఆయా స్టేడియాలున్న రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకుని టోర్నమెంట్లను వాయిదా వేసింది బీసీసీఐ. కాగా, టీమీండియా సీనియర్ల జట్టు మాత్రం ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తుండటం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.