BCCI PLANS IPL 2022 FINAL CLOSING CEREMONY GRANDLY HERE GUEST LIST AND PERFORMANCES LIVE STREAM DETAILS SRD
IPL 2022 Final : బాక్స్ బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్ అదే..!
IPL Final 2022
IPL 2022 Final : కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో 100 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐకి అనుమతి దక్కింది. ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌కి ముందు గంటపాటు ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలు జరుగుతాయి.
ఐపీఎల్ 2022 సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైనల్ (IPL 2022 Final) కి రంగం సిద్ధమైంది. 10 ఫ్రాంఛైజీలు పోటీపడిన ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ (GT vs RR) టగ్ ఆఫ్ వార్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయ్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో జరిగే ఈ రెండు మ్యాచ్‌లకు ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు విక్రయించింది బీసీసీఐ (BCCI). కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో 100 శాతం ప్రేక్షకుల మధ్య మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐకి అనుమతి దక్కింది. ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. టాస్‌కి ముందు గంటపాటు ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలు జరుగుతాయి.
దీనికి బాలీవుడ్ ప్రముఖుల హాజరుకాబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ క్లోజింగ్ సెర్మనీ కారణం 30నిమిషాలు ఆలస్యంగా అంటే రాత్రి 8గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ ముగింపు వేడుకల్ని బీసీసీఐ భారీగానే ప్లాన్ చేసింది. మూడేళ్ల తర్వాత క్లోజింగ్ సెర్మనీ జరుగుతుండటం వల్ల బీసీసీఐ తగ్గేదేలే అన్నట్టు ఏర్పాట్లు చేసింది. కరోనా వల్ల గడిచిన రెండేళ్ల ఐపీఎల్‌లో ఎటువంటి వేడుకను నిర్వహించలేదు.
ముగింపు వేడుకకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ గౌరవ కార్యదర్శి జయ్ షా, భారత మాజీ కెప్టెన్లు హాజరుకానున్నారు. ముగింపు వేడుకల్లో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నాడు. అలాగే మ్యూజిక్ మాస్ట్రో, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ వేదిక మీద తన సంగీతంతో ఉర్రూతలూగించనున్నారు. ఇకపోతే ఈ క్లోజింగ్ సెర్మనీలో స్పెషల్ అట్రాక్షన్‌గా జార్ఖండ్‌లోని ప్రసిద్ధ ఛౌ డ్యాన్స్ ను కూడా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం జార్ఖండ్‌కు చెందిన ఛౌ డ్యాన్స్ చేసే 10మంది కళాకారుల బృందాన్ని బీసీసీఐ ఖరారు చేసింది.
ఇక సాయంత్రం 6.15pm నుంచి ఈ వేడుక ప్రారంభమై నలభై నిమిషాల పాటు సాగుతుంది. 7pm గంటలకు క్లోజింగ్ సెర్మనీ ముగుస్తుంది. తర్వాత 7.30కు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వస్తారు. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ముగింపు వేడుకలో ప్రత్యేకంగా భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలు జరుపుతారు.
ఈ సందర్భంగా ఈ 75ఏళ్లలో ఇండియాలో క్రికెట్ ప్రస్థానం ఎలా సాగిందో చూపించేలా భారీ స్క్రీన్లపై ప్రజెంటేషన్ ఉంటుంది. తొలుత కరోనా వల్ల బీసీసీఐ క్లోజింగ్ సెర్మనీ నిర్వహించాలా వద్దా అనే డైలామాలో ఉంది. కానీ కరోనా కేసుల వ్యాప్తి అంత ఎక్కువగా లేకపోవడంతో బీసీసీఐ ముగింపు వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ ప్రసారం అవుతుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.