సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు... ఏప్రిల్ 28 లోపు స్పందించాల్సిందే...

BCCI Ombudsman : ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి రెండేసి పదవుల్లో కొనసాగుతున్నారన్న విమర్శలు టెండుల్కర్, లక్ష్మణ్‌పై వినిపిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 25, 2019, 8:34 AM IST
సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు... ఏప్రిల్ 28 లోపు స్పందించాల్సిందే...
వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండుల్కర్
  • Share this:
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్, బ్యాటింగ్ మ్యాస్ట్రో వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐకి చెందిన అంబుడ్స్‌మన్ కమ్ ఎథిక్స్ (విలువలు) అధికారి జస్టిస్ డి.కె.జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో (CAC) సభ్యులుగా ఉంటూ... ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మెంటర్స్‌ (సలహాదారులు)గా ఉండటంపై అభ్యంతరం చెబుతూ, ప్రత్యేక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు పంపారు. ప్రస్తుతం టెండుల్కర్... ముంబై ఇండియన్స్‌కి మెంటర్‌ (నమ్మకమైన సలహాదారు)గా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి లక్ష్మణ్ మెంటర్‌గా ఉన్నాడు. ఇలాంటి కేసుల్లో ఇది మూడోది. ఇదివరకు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీపై కేసు నమోదవడంతో ఆయన రిటైర్డ్ జడ్జి ముందు హాజరయ్యారు. గంగూలీ... CAB అధ్యక్షుడిగా, CAC సభ్యుడిగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.

క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యులైన వీరి ముగ్గుర్నీ... ఆ కమిటీలోకి తీసుకున్నది సీనియర్ నేషనల్ కోచ్ రవిశాస్త్రే. 2017 జులైలో అది జరిగింది. ఆ కమిటీలో ఉన్న వారు... ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సలహాదారులుగా ఎలా ఉంటారన్నది తలెత్తుతున్న ప్రశ్న.

సచిన్ టెండుల్కర్, లక్ష్మణ్ ఇద్దరూ తన నోటీసులపై ఏప్రిల్ 28 కల్లా లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు జస్టిస్ జైన్. బీసీసీఐ కూడా తన స్పందన తెలపాలని కోరారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) సభ్యుడైన సంజీవ్ గుప్తా వేసిన కంప్లైంట్‌పై స్పందిస్తూ జైన్ ఈ నోటీసులు జారీ చేశారు.

తన నోటీసులకు ఏప్రిల్ 28కల్లా సమాధానం ఇవ్వకపోతే, ఆపై ఇలాంటి అవకాశం ఉండదని జైన్ హెచ్చరించారు. బుధవారం 46వ పుట్టిన రోజు జరుపుకున్న సచిన్ టెండుల్కర్, లక్ష్మణ్ ఇద్దరూ ఈ నోటీసులపై ఇంకా స్పందించలేదు.

 

ఇవి కూడా చదవండి :

ఐసిస్ నెక్ట్స్ టార్గెట్ ఇండియా... బాంబు పేలుళ్లకు భారీ స్కెచ్...బాబు జోక్ వేశాడు... 16 గంటలు ఆగిపోయిన విమానం... ఏమన్నాడంటే...

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...

పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...
First published: April 25, 2019, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading