హోమ్ /వార్తలు /క్రీడలు /

Jasprit Bumrah : టి20 ప్రపంచకప్ నుంచి జస్ ప్రీత్ బుమ్రా అవుట్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. అతడి స్థానంలో ఎవరంటే?

Jasprit Bumrah : టి20 ప్రపంచకప్ నుంచి జస్ ప్రీత్ బుమ్రా అవుట్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. అతడి స్థానంలో ఎవరంటే?

PC : TWITTER

PC : TWITTER

Jasprit Bumrah : అనుకున్నదే అయ్యింది. వెన్ను గాయంతో దక్షిణాఫ్రికా (South Africa)తో సిరీస్ కు దూరమైన జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah).. టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) సోమవారం అధికారికంగా ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Jasprit Bumrah : అనుకున్నదే అయ్యింది. వెన్ను గాయంతో దక్షిణాఫ్రికా (South Africa)తో సిరీస్ కు దూరమైన జస్ ప్రీత్ బుమ్రా (Jasprit bumrah).. టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) సోమవారం అధికారికంగా ప్రకటించింది. బుమ్రా ప్రపంచకప్ నుంచి గాయంతో తప్పుకున్నాడని గత మూడు రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం అతడింకా ప్రపంచ కప్ నుంచి తప్పుకోలేదని ఈ రోజటి దాకా బుకాయిస్తూ వచ్చింది. ఆఖరికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా టి20 ప్రపంచకప్ నుంచి బుమ్రా తప్పుకోలేదని మొన్నటికి మొన్న ప్రకటించాడు. అయితే తాజాగా బుమ్రా  గాయం ఎక్కువగా ఉందని.. అతడు టి20 ప్రపంచకప్ లోపు కోలుకోవడం కష్టమని డాక్టర్లు సూచించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు బుమ్రాను టి20 ప్రపంచకప్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది.

బుమ్రా స్థానంలో ఎవరు?

జస్ ప్రీత్ బుమ్రా టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో సెలెక్టర్లు ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో టీమిండియా జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రకటించింది. ఇందులో షమీ, చహర్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లు ఉన్నారు. బుమ్రా గాయంతో తప్పుకోవడంతో సరిగ్గా అతడి లాంటి ప్లేయర్ (పేసర్)నే జట్టులోకి చేర్చనుంది. దీపక్ చహర్ లేదా మొహమ్మద్ షమీలలో ఒకర్ని ప్రధాన జట్టులోకి చేర్చే అవకాశం ఉంది.

స్టాండ్ బై ప్లేయర్ తోనే  బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాలనే రూల్ కూడా ఏమీ లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హైదరాబాదీ స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కూడా ప్రపంచకప్ రేసులో ఉన్నాడు. అతడిని నేరుగా టి20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న షమీ  లేదా దీపక్ చహర్ లలో ఒకరు టి20 ప్రపంచకప్ జట్టులో చేరే అవకాశం ఉంది. సిరాజ్ స్టాండ్ బై ప్లేయర్ గా ఉండే అవకాశం ఉంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, India vs South Africa, Jasprit Bumrah, T20 World Cup 2022, Team India

ఉత్తమ కథలు