BCCI OFFICIAL MADE SOME INTERESTING COMMENTS ON TEAM INDIA NEW CAPTAIN ROHIT SHARMA AS FIRST CHOICE SRD
Team India Next Captain : నో డౌట్.. బీసీసీఐ ఫిక్స్.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే..!
Who Is Next Captain
Team India Next Captain : టీమిండియాకు కెప్టెన్సీ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఎందరో దిగ్గజాలు టీమిండియాను టెస్టుల్లో సమర్ధవంతంగా నడిపించారు. అయితే, ప్రస్తుత ప్రశ్న ఏంటంటే.. విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా నెక్ట్స్ టెస్ట్ కెప్టెన్ ఎవరు?
విరాట్ కోహ్లీ.. తనకు తానే స్వయంగా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీకి సరియైన సూచనలిస్తున్నారు. కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, రోహిత్ శర్మ (Rohit Sharma) కు లిమిటెట్ ఫార్మాట్ల బాధ్యతను అప్పగించింది బీసీసీఐ. అయితే, విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరనే చర్చ ఇప్పుడు అంతటా నడుస్తుంది. ప్రస్తుతం వన్డే, టీ20 లకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మనే టెస్టులకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మాజీల నుంచి కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి యువ ప్లేయర్ల పేర్లు కూడా వినిపిస్తుండడంతో కొత్త కెప్టెన్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు కొత్త కెప్టెన్ ప్రస్తావనపై స్పందించారు.
ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌తో టీమిండియాకు కొత్త కెప్టెన్ (Team India New Captain) ఎవరనే దానిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పటికవరకు సెలెక్టర్లు చర్చించలేదని ఆయన తెలిపారు. అయితే కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మకే ఎక్కువ అవకాశాలున్నాట్టు ఆయన చెప్పారు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మనే వైస్ కెప్టెన్ గా ఉన్నాడని.. అందుకే అతడే భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్సులున్నాయని ఆయన తెలిపారు.
త్వరలోనే తదుపరి టెస్టు కెప్టెన్‌ను సెలక్షన్ కమిటీ సిఫారసు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే కొత్త కెప్టెన్ రేసులో కేఎల్ రాహుల్ అంశం గురించి మీడియా ప్రశ్నించగా సెలెక్టర్లు అందరి గురించి చర్చిస్తారని, అన్ని ఎంపికలను పరిశీలిస్తారని ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జొహన్నెస్‌బర్గ్ టెస్టు జట్టులో భారత జట్టుకు కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌కు ముందు వెన్ను గాయంతో దూరమైన సంగతీ తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అయితే కేప్ టౌన్ టెస్టుకు ముందు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్‌కు కఠిన సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టెస్టు క్రికెట్లో భారత జట్టును విరాట్ ఆ రేంజులో తయారు చేశాడని అంటున్నారు. బ్యాటర్‌గా ముందుండి నడిపించడమే కాకుండా కోహ్లీ జట్టును బలంగా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా కోహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియాఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 42 నెలలపాటు అగ్ర స్థానంలో ఉంది. అలాగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కూడా చేరింది. ఆస్ట్రేలియా వంటి దేశంలో టెస్టు సిరీస్ గెలవడంతోపాటు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో అధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.