గంగూలీ వాళ్ళ కోసం చేసిందేంటి: మల్హోత్రా

అశోక్‌ మల్హోత్రా గతకొంతకాలంగా బీసీసీఐని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అతని విమర్శలలో మానవతా కోణం ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడుతుండడంతో అవి వివాదాస్పదంగా మారుతున్నాయి.

Rekulapally Saichand
Updated: July 20, 2020, 4:40 PM IST
గంగూలీ వాళ్ళ కోసం చేసిందేంటి: మల్హోత్రా
సౌరవ్ గంగూలీ (File Photo)
  • Share this:
సౌరవ్ గంగూలీపై మరోసారి ఫైరయ్యారు అశోక్ మల్హోత్రా. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికై 10 నెలలు అయినప్పటికి సీనీయర్ క్రికెటర్ల విషయంలో ఆయన చేసేందేమి లేదంటూ విమర్శించారు. "బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఎన్నికైనప్పటి నుంచి మాజీ క్రికెటర్లకు ఎలాంటి మేలు చేయలేదు. మరణించిన మాజీ క్రికెటర్ల కుంటుంబాలకు, మెడికల్‌ ఇన్సురెన్స్‌ను పెంచే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాజీ క్రికెటర్ల చేయూతను ఇవ్వడంలో విఫలమ్యారు. పెడింగ్‌లో డిమాండ్లను వెంటనే పరిష్కారించాలి. 70 వయసు దాటిన మాజీ ఆటగాళ్ళ వెధనకు గురి చేయద్దు. గంగూలీతో పాటు మిగితా సభ్యులైన శాంతా రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లు కూడా వారి డిమాండ్లను పరిష్కారానికి కృషి చేయాలంటూ" మల్హోత్రా బీసీసీఐని డిమాండ్ చేశారు.

అశోక్‌ మల్హోత్రా గతకొంతకాలంగా బీసీసీఐని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అతని విమర్శలలో మానవతా కోణం ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడుతుండడంతో అవి వివాదాస్పదంగా మారుతున్నాయి. ఐసీఏలో డైరెక్టర్‌గా ఉన్న మల్హోత్రా మిగితా డైరక్టర్లతో చర్చికుండానే విమర్శలకు దిగుతుండడంతో పర్వాత్ర చర్చనీయాంశంగా మారింది. ఐసీఏలోని మిగితా డైరెక్టర్ల ఏమాత్రం మాల్హోత్రాను పట్టించుకోకపోవడంతో ఆయన అందరి ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది.
Published by: Rekulapally Saichand
First published: July 20, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading