హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI : వచ్చే ఐపీఎల్ లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన! న్యూ రూల్ తో మరింత ఆసక్తికరంగా ధనాధన్ లీగ్.. రూల్స్ ఇవే..

BCCI : వచ్చే ఐపీఎల్ లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన! న్యూ రూల్ తో మరింత ఆసక్తికరంగా ధనాధన్ లీగ్.. రూల్స్ ఇవే..

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

BCCI : టి20 ఫార్మాట్ ఎంట్రీతో క్రికెట్ (Cricket) ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి వరకు క్లాస్ గా సాగుతున్న క్రికెట్ లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్ గా మారిపోయింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

BCCI : టి20 ఫార్మాట్ ఎంట్రీతో క్రికెట్ (Cricket) ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటి వరకు క్లాస్ గా సాగుతున్న క్రికెట్ లోకి ధనాధన్ షాట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంట్రీతో క్రికెట్ పక్కా కమర్షియల్ గా మారిపోయింది. పసందైన ఆటతో అభిమానులను అలరిస్తూనే కాసుల వర్షం కురిపిస్తోన్న ఐపీఎల్.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుంది. అయితే టి20 ఫార్మాట్ ను మరింత రంజుగా చేయడానికి బీసీసీఐ (BCCI) నడం బిగించింది. ’ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player)‘ కాన్సెప్ట్ తో వచ్చే ఐపీఎల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా చేసేందుకు కసరత్తులు చేస్తుంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను పరీక్షించేందుకు దేశవాళి క్రికెట్ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali)ని వేదికగా చేసుకోనుంది. అక్టోబర్ 11 నుంచి ఆరంభమయ్యే ఈ టోర్నీలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను ట్రయిల్ రన్ గా పరీక్షించనున్నారు. అన్ని ఓకే అయితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ 16వ సీజన్ లో  ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అరంగేట్రం చేయనుంది.

ఇంతకీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అంటే ఏమిటి?

సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఫుట్ బాల్, రగ్బీ ఆటలను చూసే వారికి ఇంపాక్ట్ ప్లేయర్ ఎంటో ఇట్టే అర్థం అవుతుంది. ప్రస్తుతానికి టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు (11 మంది) ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు. అతడికి బౌలింగ్, బ్యాటింగ్ చేసే వెసులు బాటు ఉండదు. అయితే కంకషన్ సబ్ స్టిట్యూట్ కు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలుంటుంది. తలకు గాయమైతే కంకషన్ సబ్ స్టిట్యూట్ కు వెసులుబాటు ఉంది. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్ అలా ఉండదు. టాస్ సమయంలో ఇరు జట్లు 11 మందితో తమ తుది జట్లను ప్రకటించడంతో పాటు మరో నలుగురితో ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను అంపైర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇరు జట్లు కూడా తమ ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితా నుంచి ఒక ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకునే వెసులు బాటు ఉంటుంది. అలా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేసే వీలు ఉంటుంది.

రూల్స్ ఇవే

1.ఇరు జట్లు కూడా టాస్ సమయంలో తుది జట్టుతో పాటు మరో నలుగురితో ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాను ఇవ్వాలి.

2.ఇరు జట్లు కూడా ఒక్క ప్లేయర్ ను మాత్రమే మార్చేందుకు వీలు ఉంటుంది.

3. అది కూడా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు మార్చాలి. ఇది రెండు ఇన్నింగ్స్ లకు వర్తిస్తుంది. 15 నుంచి 20 ఓవర్ల మధ్య ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకోవడం జరగదు.

4. ఇంపాక్ట్ ప్లేయర్ ను ఉపయోగించేటప్పుడు ఆ విషయాన్ని కెప్టెన్ ఫీల్డ్ అంపైర్ తో గానీ లేక ఫోర్త్ అంపైర్ తో గానీ చెప్పాల్సి ఉంటుంది.

5.ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వెళ్లిపోయిన ప్లేయర్ మళ్లీ బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉండదు.

6. ఇంపాక్ట్ ప్లేయర్ కు పూర్తి కోటా బౌలింగ్ చేసే అవకాశంతో పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Chennai Super Kings, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, IPL, IPL 2022, MS Dhoni, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు