IPL 2020: దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్‌లు..?

టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం వెలువడిన తర్వాత.. ఐపీఎల్ 2020పై పాలక వర్గం నిర్ణయం తీసుకుంటుంని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: July 2, 2020, 9:50 PM IST
IPL 2020: దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్ మ్యాచ్‌లు..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీల్ నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మార్చి నెల జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఐతే మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి విదేశాల్లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. దుబాయ్ లేదా శ్రీలంక వేదికగా మ్యాచ్‌లను నిర్వహించాలని భావిస్తోంది. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ నిర్ణయం వెలువడిన తర్వాత.. ఐపీఎల్ 2020పై పాలక వర్గం నిర్ణయం తీసుకుంటుంని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

వేదికను ఇంకా నిర్ణయించలేదు. విదేశాల్లో నిర్వహించే అవకాశమైతే ఉంది. ఒకేసారి ఎక్కువ జట్లు వచ్చి ఒకటి లేదా రెండు గ్రౌండ్స్‌లో ఆడే పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఆటగాళ్లకు సురక్షిత వాతావరణం కల్పించాలి. దుబాయ్‌, శ్రీలంక దేశాలు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాయి. వైరస్‌ పరిస్థితి, వసతుల అవసరాలను బట్టి వేదికను నిర్ణయించాల్సి ఉంటుంది.
బీసీసీఐ వర్గాలు


ఐతే వీలైనంత వరకు భారత్‌లోనే ఐపీఎల్ లీగ్‌ను నిర్వహించాలని భావిస్తున్నరట. కానీ మన దేశంలో రోజు రోజుకు కరోనా తీవ్ర పెరుగుతోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియదు. పరిస్థితి ఇలాగే ఉంటే విదేశాలకు తరలించడమే మంచిదని నిర్వాహకులు యోచిస్తున్నారు.



First published: July 2, 2020, 9:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading