Home /News /sports /

BCCI IS IN TOTAL CONFUSE IN TEAM INDIA CAPTAINCY ROW FROM VIRAT KOHLI TO HARDIK PANDYA 7 SKIPPER CHANGED IN LAST YEAR SRD

Team India : టీమిండియాలో కుర్చీలాట.. ఏడాదిలో ఏడుగురు సారథులు.. ఇలా అయితే కష్టమే బాసూ..!

Team India (PC : BCCI)

Team India (PC : BCCI)

Team India : బీసీసీఐ అయోమయంలో ఉందా..? భవిష్యత్తు కెప్టెన్ పై తర్జన భర్జన పడుతుందా..? అంటే అవుననే లానే ఉన్నాయ్ బీసీసీఐ సెలెక్టర్ల పనులు.

    టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి అకస్మాత్తుగా వైదొలిగిన విరాట్ కోహ్లీ బీసీసీఐని ఇబ్బందుల్లోకి నెట్టాడు. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు ప్లేయర్స్, బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికివారే యమునాతీరులా వ్యవహరిస్తున్నారు. బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఎలాంటి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఎలాంటి సమాచారం లేకుండా వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించి.. రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో.. కలత చెందిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు టెస్టులకు అనుహ్యంగా గుడ్ బై చెప్పాడు.దీంతో.. టీమిండియా నెక్ట్స్ టెస్ట్ కెప్టెన్ గా హిట్ మ్యాన్ కే తిరిగి బాధ్యతలు అప్పగించింది.

    యంగ్ ప్లేయర్ సెట్ అయ్యే దాకా రోహిత్ శర్మను కేర్ టేకర్ కెప్టెన్ గా నియమించాలన్నది బీసీసీఐ గేమ్ ప్లాన్. వైస్ కెప్టెన్ గా నియమించే ప్లేయర్ అనుభవం తెచ్చుకునేదాకా ఓ ఏడాది లేదా రెండేళ్లు మాత్రమే రోహిత్ శర్మను కెప్టెన్ గా చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు యంగ్ క్రికెటర్ కు అప్పగించనున్నారు.



    రోహిత్ శర్మ ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. ఈ వయస్సులో మరో రెండు మూడేళ్లకు మించి రోహిత్ శర్మ ఆడే ఛాన్సులు తక్కువ. అందుకే.. అనుభవం గల రోహిత్ శర్మనే కేర్‌టేకర్ కెప్టెన్‌గా పనికొస్తాడన్నది బీసీసీఐ ఆలోచన. కానీ, ఆ ప్లాన్ ను అమలు చేయడంలో బీసీసీఐ తడబడుతోంది.ఎంతలా అంటే ఒకే ఏడాదిలో జట్టుకు ఏడుగురు సారథ్యం వహించారు.

    ఒకే సమయంలో రెండు పర్యటనలకు వెళ్లడం, సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం.. గాయపడటం వంటి పరిస్థితుల కారణంగా టీమిండియా ఈ గతి పట్టింది. గత 11 నెలల కాలంలో విరాట్ కోహ్లీ నుంచి శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాలతో మొత్తం ఏడుగురు జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకోవడం విశేషం.

    ఇది కూడా చదవండి : అరె ఏంట్రా ఇది.. ఈ లెక్కలు చూస్తే మన ఐపీఎల్ ముందు పాక్ సూపర్ లీగ్ జుజుబీ..!

    ప్రస్తుత భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రూపంలో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లకు ఫాలోయింగ్ ఉన్నా... విరాట్, రోహిత్ ఫాలోయింగ్, క్రేజ్, అనుభవం వేరు. దీంతో.. టెస్ట్ కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ ని చేయడం ఇప్పుడు బీసీసీఐ కఠిన సవాల్ గా మారనుంది. ఇక, గత 10 రోజుల్లోనే ముగ్గురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ.

    ఐపీఎల్ 2022 టోర్నీ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కి కెప్టెన్‌ గా ఎంపికైన కేఎల్ రాహుల్, మొదటి టీ20 ఆరంభానికి ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ లో పర్యటించే జట్టులో రిషభ్ పంత్ కు చోటు దక్కడంతో... ఐర్లాండ్ లో పర్యటించే మరో జట్టుకి హార్ధిక్ పాండ్యా సారథిగా ఎంపిక చేశారు. దాంతో ఏడాది కాలంలోనే టీమిండియాను ఏడుగురు కెప్టెన్లు నడిపించారు. భవిష్యత్తు కెప్టెన్ మీద బీసీసీఐ ఒక అంచనాకి రాకపోతే.. అసలకే ఎసరు వచ్చే అవకాశం ఉందని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

    తదుపరి వార్తలు