news18-telugu
Updated: August 1, 2019, 6:20 PM IST
రవిశాస్త్రి, కోహ్లీ (ఫైల్ చిత్రం)
టీమిండియా చీఫ్ కోచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి ప్లేస్ లో కొత్త కోచ్ నియామకానికి దాదాపు 2వేల దరఖాస్తులు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేశీయ కోచ్ లతో పాటు పలు విదేశీ కోచ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి టామ్ మూడీతో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్, సౌతాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్, శ్రీలంక నుంచి మహేళా జయవర్ధనే లాంటివారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు దేశీయ కోచ్ లలలో రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుత్ దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఉంది. ఈ సిరీస్ తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవీ కాలం ముగిసిపోనుంది. దీంతో కొత్త కోచ్ వెతుకులాటలో బీసీసీఐ నిమగ్నమై ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే కెప్టెన్ కోహ్లీ మాత్రం రవిశాస్త్రినే కోచ్ గా కొనసాగేలా పావులు కదుపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. కాగా అన్షుమన్ గైక్వాడ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్ ఎంపికలో నిర్ణయం తీసుకోనుంది.
Published by:
Krishna Adithya
First published:
August 1, 2019, 6:10 PM IST