హోమ్ /వార్తలు /క్రీడలు /

Rishabh Pant : రిషబ్ పంత్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ .. ప్రస్తుత పరిస్థితి ఇదే..!

Rishabh Pant : రిషబ్ పంత్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చిన బీసీసీఐ .. ప్రస్తుత పరిస్థితి ఇదే..!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Rishabh Pant : తాజాగా బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డెహ్రడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం తర్వాత పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్దమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం న్యూఢిల్లీలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. వేగంగా దూసుకువెళ్తున్న కారు, రోడ్డు డివైడర్‌ని ఢీ కొట్టింది. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం. ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో నుంచి భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. అయితే సరైన సమయానికి కారులో నుంచి రిషబ్ పంత్ బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోంచి పంత్ దూకకపోతే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానిక అధికారులు తెలుపుతున్నారు. ఫస్ట్ పంత్ ను సాక్ష్యం మల్లీ స్పెషాలిటీ హాస్పిటల్ చేర్చారు. ఇప్పుడు మ్యాక్స్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు.

తలపై గాయాలు, మోకాలి లిగమెంట్ తెగిపోవడం, వీపు భాగంలో కాలడం జరిగింది. "ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో క్రికెటర్ రిషబ్ పంత్ ఉన్నారు. ఆయన కండిషన్ నిలకడగానే ఉంది. పరీక్షలన్నీ ముగిసిన తర్వాత పూర్థిస్థాయి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాం " అని మ్యాక్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ ప్రకటించారు.

తాజాగా బీసీసీఐ కూడా రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రిషబ్ పంత్‌ నుదుటిన రెండు కాట్లు పడ్డాయని తెలియచేసిన బీసీసీఐ, కుడి మోకాలికి గాయమైందని తెలిపింది. అలాగే అతని కుడి మోచేతికి, పాదానికి, బొటనవేలికి కూడా గాయాలైనట్టు స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రమాదం లేదని.. క్షేమంగానే ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. అతనికి.. అతని కుటుంబానికి కావాల్సిన సాయం అందిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించాడు.

మరోవైపు క్రికెట్ అభిమానులు, క్రికెటర్లు పంత్ యాక్సిడెంట్ వార్తపై దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రిషబ్‌ పంత్‌కి ధైర్యం చెబుతూ , ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో మెసేజ్‌లు చేస్తున్నారు. " తొందరగా కోలుకో భాయ్ సాబ్. అల్లా నీకు తోడుగా ఉంటాడని " మహ్మద్ షమీ ట్వీట్ చేశాడు. పంత్ ప్రమాదం నుంచి బయటపడి.. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నానని రవిశాస్త్రి తెలిపాడు. మిగతా క్రికెటర్లు కూడా పంత్ కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.

First published:

Tags: Bcci, Cricket, Rishabh Pant, Team India

ఉత్తమ కథలు