హోమ్ /వార్తలు /క్రీడలు /

BCCI: బీసీసీఐ ఖజానాలోకి చేరనున్న రూ. 5000 కోట్లు? అంతా ప్లాన్ ప్రకారం జరిగితే క్రికెట్ బోర్డుకు డబ్బే డబ్బు

BCCI: బీసీసీఐ ఖజానాలోకి చేరనున్న రూ. 5000 కోట్లు? అంతా ప్లాన్ ప్రకారం జరిగితే క్రికెట్ బోర్డుకు డబ్బే డబ్బు

బీసీసీఐ ఖజానాలోకి చేరనున్న రూ. 5 వేల కోట్లు? (PC: BCCI)

బీసీసీఐ ఖజానాలోకి చేరనున్న రూ. 5 వేల కోట్లు? (PC: BCCI)

BCCI: బీసీసీఐ ఖాతాలోకి మరో రూ.5 వేల కోట్లు వచ్చి చేరబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు మరింత సంపన్నం కాబోతున్నది. అయితే బీసీసీఐకి డబ్బు ఏ రూపంలో రాబోతున్నది?

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI) త్వరలో మరింత రిచ్ కాబోతున్నది. బోర్డు ఖజానాలోకి దాదాపు రూ. 5000 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్, ఎండోర్స్‌మెంట్ల ద్వారా కోట్లాది రూపాయలు తమ ఖాతాలో వేసుకుంటున్న క్రికెట్ బోర్డు త్వరలో రూ.5 వేల కోట్ల వరకు సంపాదించేందుకు రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL) 8 జట్లు పాల్గొంటుండగా.. ఆ సంఖ్య 2022 నుంచి 10 జట్లకు పెరుగనున్నది. త్వరలో రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించనున్నది. ఈ రెండు జట్ల టెండర్ల ద్వారా కనీసం రూ. 5 వేల కోట్లు సంపాదించాలని బీసీసీఐభావిస్తున్నది. ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో టెండర్ల బిడ్డింగ్ డాక్యుమెంట్ల ధరతో పాటు కొత్త టీమ్‌ల కోసం మినిమం వాల్యూను ఖరారు చేశారు. బిడ్డింగ్ డాక్యుమెంట్ ధర రూ. 75 కోట్లు కాగా.. కొత్త టీమ్ కనీస ధర రూ.2 వేల కోట్లుగా నిర్ణయించారు. గతంలో రూ. 1700 కోట్లు కనీస ధర నిర్ణయిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దాన్ని రూ. 2వేల కోట్లుగా నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులో బ్రిటన్‌కు చెందిన ఒక సంస్థ సగం వాటాను రూ. 1700 కోట్లకు పైగా ధరకు కొనుగోలు చేసింది. ఆ విధంగా చూసుకున్నా.. ఒక ఫ్రాంచైజీ ధర రూ. 2 వేలకు పైగానే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే బీసీసీఐ కనీస ధరను రూ. 2వేల కోట్లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇక బిడ్డింగ్ ప్రాసెస్‌లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం బిడ్డింగ్ వేయాలనుకునే సంస్థ టర్నోవర్ ఏడాదికి కనీసం రూ. 3000 కోట్లు ఉండాలని నిర్ణయించింది. అయితే మూడు సంస్థలు కలసి కన్సార్టియంగా ఏర్పడి కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం బిడ్లు వేసే వెసులు బాటు ఇచ్చింది. దీని వల్ల మరింత పోటీ పెరిగి బీసీసీఐకు లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్, లక్నో, పూణే కేంద్రలుగా బిడ్డింగ్‌లు దాఖలు చేయవచ్చు. టాప్ 2 ధర వచ్చిన రెండు కేంద్రాలకు ఫ్రాంచైజీలు అలాట్ చేయనున్నారు. అహ్మదాబాద్, లక్నోల్లో భారీ స్టేడియంలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీ స్టేడియం. లక్నోలోని ఎకానా స్టేడియంల కెపాసిటీ భారీగా ఉంటుంది కాబట్టి ఆయా నగరాలు కేంద్రంగా వచ్చే ఫ్రాంచైజీలకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. మహరాష్ట్రలో ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు ఉండటంతో పూణేకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Space Pens: స్పేస్‌లో సైతం పనిచేసే ‘త్రీ ఇడియట్స్’ పెన్ను.. అసలు దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా?

ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం భారీ పోటీ నెలకొన్నది. అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలుకు మొదటి నుంచి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఆర్పీజీ సంజీవ్ గోయాంక గ్రూప్, టొర్రెంట్ ఫార్మా కంపెనీతో పాటు ప్రముఖ బ్యాంకర్ కూడా ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అహ్మదాబాద్ కోసం అదాని గ్రూప్ అవసరం అయితే రూ.2500 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందుకే రెండు ఫ్రాంచైజీలు కలిపి రూ. 5 వేల కోట్ల వరకు జమ అవుతుందని బీసీసీఐ భావిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం అయితే జులైలోనే టెండర్లు పిలివాలి. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. సెప్టెంబర్‌లో బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీల కోసం బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Cristiano Ronaldo: ఫుట్‌బాల్ చరిత్రలో మైలురాళ్లుగా మారిన ఆటగాళ్ల బదిలీలు.. ఈ బదిలీలను మర్చిపోలేరు

First published:

Tags: Bcci, Cricket, IPL

ఉత్తమ కథలు