Home /News /sports /

BCCI DOUBLES THE BASE PRICE OF IPL MEDIA BROADCASTING AND DIGITAL RIGHTS AND EYES ON 50000 CRORE HUGE AMOUNT SRD

IPL 2022 - BCCI : టార్గెట్ రూ.50 వేల కోట్లు.. మరింత వెనుకేసుకోవడానికి బీసీసీఐ మాస్టర్ స్కెచ్.. ఇక, కాసుల వర్షమే..!

IPL 2022

IPL 2022

IPL 2022 - BCCI : ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఐపీఎల్ యే. కామధేనువు లాంటి ఐపీఎల్ ద్వారా మరింత వెనుకేసుకోవడానికి బీసీసీఐ మాస్టర్ స్కెచ్ వేసింది.

    ఇంగ్లండ్ (England) లో పుట్టి అక్కడ విజయవంతమైన పొట్టి క్రికెట్ (T20 Cricket) కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ (IPL) అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. క్రికెట్‌లో ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ (India) అగ్రస్థానంలో నిలవడానికి, బీసీసీఐ (BCCI) రిచెస్ట్ బోర్డ్ అవ్వడానికి కూడా కారణం ఇదే. ఐపీఎల్ కు తొలి బీజం 2007 లో పడింది. 2007 టీ-20 వరల్డ్ కప్ తర్వాత లీగ్ రూపంలో పొట్టి క్రికెట్ ను నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటిచింది. ఇక, ఏప్రిల్ 2008 లో ప్రారంభమైన ఈ మెగాటోర్నీ ఇప్పుడు ప్రపంచంలోనే క్రికెట్ లీగుల్లో శక్తివంతమైన టోర్నీగా అవతరించింది. అలాంటి, కామధేనువు లాంటి లీగ్ ను వీలైనంతగా వాడుకుంటోంది బీసీసీఐ. ఈ లీగ్ ద్వారా ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు బీసీసీఐ మాస్టర్ స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా విడుదల చేసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలానికి సంబంధించి కనీస బేస్ ప్రైస్ ను కూడా అమాంతం పెంచింది.

    గతంలో ఉన్న కనీస ధర రూ. 16,347.5 కోట్లను ఇప్పుడు డబుల్ చేసింది. ఏం చేసైనా సరే.. మీడియా హక్కుల ద్వారా రూ. 50వేల కోట్లను ఆర్జించడమే బీసీసీఐ టార్గెట్ పెట్టుకుంది. 2023-2027 (ఐదేళ్ల కాలానికి) గాను బీసీసీఐ.. ఐపీఎల్ మీడియా హక్కుల ఈ-టెండర్ ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా వ్యవహరిస్తున్న డిస్నీ స్టార్ ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది.

    2018లో స్టార్.. ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్నప్పుడు వీటి బేస్ ప్రైస్.. రూ. 16,347.5 కోట్లుగా ఉండేది. ఇప్పుడు దానిని రూ. 33,000 కోట్లకు పెంచింది. అంటే గతంతో పోల్చితే వంద శాతం అధికం. ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కనీస ధరను పెంచినట్టు తెలుస్తోంది. ఇక.. ఈసారి మీడియా హక్కులను అన్లాక్ చేయడానికి గాను వాటిని 4 బండిల్ లుగా విభజించారు. ఒక సంస్థ ఒకే బిడ్ వేయాలి. మిశ్రమ బిడ్ లను కూడా అనుమతించడం లేదు.



    బండిల్ ఏ : భారత ఉపఖండంలో ప్రసారాలు : ఈ ప్యాకేజీ కోసం బేస్ ధర ఒక్కో గేమ్ కు రూ. 49 కోట్లు (మొత్తం 74 మ్యాచులు). ఐదేళ్లకు లెక్కన రూ. 18,130 కోట్లు.

    బండిల్ బీ : భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులు : ఒక్కో మ్యాచుకు రూ. 33 కోట్లు. ఐదేళ్లకు 12,210 కోట్లు

    బండిల్ సీ : నాన్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజీ : 18 గేమ్ లను కలిగిఉన్న ఈ ప్యాకేజీ బండిల్ సీలో ఉంది. ఈ క్లస్టర్ లో ఒక్కో గేమ్ కు రిజర్వ్ ధర రూ. 16 కోట్లు. ఒక్కో సీజన్ కు రూ. 74 గేమ్ లు. ఈ లెక్కన ఐదేండ్ల పాటు రూ. 1440 కోట్లు.

    బండిల్ డీ : ఉపఖండం బయట (ప్రపంచవ్యాప్తంగా) : ఈ ప్యాకేజీలో ఒక్కో గేమ్ కు రూ. 3 కోట్లుగా నిర్ణయించారు. ఐదేళ్లకు 1110 కోట్లు.

    ఇది కూడా చదవండి : ఓటమి తర్వాత కేకేఆర్ చేసిన ట్వీట్ చదవగల సత్తా ఉందా మీకు.. పాపం, ఆర్యన్ బుక్కయ్యాడు..!

    2023-27 సీజన్ కోసం ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్లకు బీసీసీఐ ఇటీవలే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జూన్ 12 న ఇందుకు సంబంధించిన వేలం నిర్వహించి విజేత పేరును బీసీసీఐ ప్రకటించనుంది. మొత్తానికి.. తంతే బూరెల బుట్టలో పడ్డట్టులా తయారైంది బీసీసీఐ పరిస్థితి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Cricket, IPL, IPL 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు