ఆ మీటింగ్ తర్వాతే ఐపీఎల్‌పై తుది నిర్ణయం

ఎప్పటికైనా ఐపీఎల్ జరుగుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ నుంచి వస్తున్న వార్తలు వారికి లీగ్ జరుగుతుందనే ఆశలు చిగురుస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌పై దాదాపు వాయిదా పడే అవకారవశం ఉండడంతో ఇనాళ్ళు నాన్చుడు ధోరణిలో ఉన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తోంది.

Rekulapally Saichand
Updated: July 17, 2020, 4:58 PM IST
ఆ మీటింగ్ తర్వాతే  ఐపీఎల్‌పై తుది నిర్ణయం
ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే... బీసీసీఐ రూ. 2500 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వ్యాఖ్యానించారు.
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో జరిగిన ఇంగ్లాండ్, విండీస్ టూర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు ఐపీఎల్‌పై పడ్డాయి. కోవిడ్ ఉధృతి కొనసాగుతుండడంతో గత కొద్ది నేలలుగా ఈ మెగా ఇవెంట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పటికైనా ఐపీఎల్ జరుగుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు బీసీసీఐ నుంచి వస్తున్న వార్తలు వారికి లీగ్ జరుగుతుందనే ఆశలు చిగురుస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌పై దాదాపు వాయిదా పడే అవకారవశం ఉండడంతో ఇనాళ్ళు నాన్చుడు ధోరణిలో ఉన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తోంది.

దీంతో శుక్రవారం జరిగే సమావేశంలో ఈ ఆంశంపై తెల్చాలని నిర్ణయించుకున్నట్లుంది. ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు గట్టి నిశ్చయంతో ఉన్నప్పటికి వేదికపైనే సందిద్గత నెలకొంది. ఇటీవల బోర్డు అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటున్నామని, పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో శ్రీలంక, యూఏఈ వేదికల్ని పరిశీలిస్తామన్నారు. దీంతో జరుగుతుందనే నమ్మకం ఫ్యాన్స్ ఏర్పడింది.

తాజాగా బీసీసీఐ అధికారి ఒక్కరు మాట్లాడుతూ ఈ మీటింగ్‌లో ఐపీఎల్ నిర్ణయం తీసుకుంటామని భావించడం లేదు. తదుపరి నిర్ణయం కోసం ప్రస్తుత పరిస్ధితులను బేరీజు వేస్తామనే అనుకుంటున్నాను. ఐసీసీ టి20 ప్రపంచకప్‌పై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సోమవారం జరిగే ఐసీసీ మీటింగ్ తర్వాత ఐపీఎల్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
Published by: Rekulapally Saichand
First published: July 17, 2020, 4:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading