ఐపీఎల్ 2022 (IPL 2022) ప్లేయర్స్ రిటెన్షన్ (Players Retention) గడువు ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలతో ముగిసింది. పాత 8 జట్లు ప్లేయర్ రిటెన్షన్ పాలసీలోని నిబంధనలు అనుసరించి ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వంటి జట్లు గరిష్టంగా నలుగురి ప్లేయర్లను తీసుకోగా.. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అయితే అసలు ఎవరినీ రిటైన్ చేసుకోలేదు. కాగా, రిటెన్షన్ గడువు ముగియడానికి ముందే అన్ని జట్లు ఆయా ప్లేయర్లతో చర్చలు జరిపాయి. పంజాబ్ కింగ్స్ జట్టు కేఎల్ రాహుల్‌ను (KL Rahul) రిటైన్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ రాహుల్ జట్టును వీడేందుకే సిద్దపడ్డాడు. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ రషీద్ ఖాన్ (Rashid Khan) కోసం పలు మార్లు చర్చలు జరిపింది. కానీ అతడు డబ్బు విషయంలో సంతృప్తిగా లేనట్లు తెలిసింది. రషీద్ అడిగినంత ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో అతడు జట్టు నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
తమ జట్టులోని ఆటగాళ్లకు భారీ డబ్బు ఆశ చూపించి తీసుకెళ్లిపోవాలని కొత్తగా చేరిన లక్నో జట్టు ప్రయత్నిస్తుందంటూ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బీసీసీఐకి పిర్యాదు చేసింది. లిఖిత పూర్వకంగా కాకుండా మాట ద్వారా ఈ పిర్యాదు చేసినా బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. లక్నో జట్టును కొనుగోలు చేసిన ఆర్పీ గోయెంకా గ్రూప్ భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కేఎల్ రాహుల్‌కు రూ. 20 కోట్లకు పైగా ఇవ్వడానికి సిద్ద పడినట్లు సమాచారం. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ రూ. 11 కోట్లు రాహుల్‌కు చెల్లిస్తున్నది. ఇక రషీద్ ఖాన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 8.9 కోట్లు ఇస్తుండగా.. లక్నో టీమ్ రూ. 16 కోట్ల వరకు చెల్లించడానికి సిద్దపడినట్లు తెలుస్తున్నది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2022, KL Rahul, Punjab kings, Rashid Khan, Sunrisers Hyderabad