Home /News /sports /

BCCI CONDITION FOR IPL PLAYERS

Ipl: ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ కండీషన్​.. ఆ పని చేస్తేనే ఎంట్రీ

ఐపీఎల్​ ట్రోపీ

ఐపీఎల్​ ట్రోపీ

యుఏఈలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్​ మ్యాచ్​లు జరగనున్నాయి. దీంతో మరోసారి కరోనా కారణంగా మ్యాచ్​లు వాయిదా పడకూడదని బీసీసీఐ పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈకి వెళ్లే ముందు ఫ్రాంచైజీ సభ్యులందరికీ ఓ కండీషన్​ విధించింది.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2021 రెండో దశ సెప్టెంబర్ 19 నుంచి జరగాల్సి ఉంది. వరుణ్​ చక్రవర్తికి కరోనా రావడం, అతను మిగతా జట్టు సభ్యులతో కలిసి తిరగడం,  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు వృద్ధిమాన్​ సాహాకు కూడా కరోనా రావడంతో మే 4న లీగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 60 క్రికెట్​ మ్యాచ్​లలో 29 మ్యాచ్‌లు జరిగాయి, ఇంకా 31 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అన్ని మ్యాచ్‌లు యుఏఈలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరగనున్నాయి. దీంతో మరోసారి కరోనా కారణంగా మ్యాచ్​లు వాయిదా పడకూడదని బీసీసీఐ పకడ్భందీ ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈకి వెళ్లే ముందు ఫ్రాంచైజీ సభ్యులందరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లను తప్పకుండా వేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయాన్ని అన్ని ఫ్రాంచైజీలకు తెలిపినట్లు వెల్లడించింది. ఇక గల్ఫ్​లో ఆటగాళ్లకు ఏడు రోజుల క్యారంటైన్​ విధించమన్నారు. అనంతరం యూఏఈలోని బుడగలోకి ప్రవేశించనున్నారు.

    దుబాయ్‌లో అత్యధికంగా 13 ఐపీఎల్​​ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది కాకుండా, షార్జాలో 10 మ్యాచ్​లు, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ తరువాత, టి 20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు కూడా యూఏఈలోనే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో అన్ని దేశాల ఆటగాళ్ళు ఐపీఎల్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నారు, తద్వారా ప్రిపరేషన్ బలోపేతం అవుతుంది. అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లపై ఇంకా అనుమానం ఉంది.

    కేన్ విలియమ్సన్ ఆడతాడు..

    న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కూడా. అతను ఐపీఎల్‌లో ఆడటానికి మార్గం క్లియర్ అయింది. ఐపీఎల్ జరిగే సమయంలో కీవీ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంటుంది. అయితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు విలియమ్సన్ సిరీస్​కు అందుబాటులో ఉండడని తెలిపింది. కేన్​ ఐపీఎల్‌లో ఆడతాడని స్పష్టం చేసింది. ఇప్పటికే సన్​రైజర్స్​ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక విలియమ్సన్​ లేకపోతే జట్టు పరిస్థతి మరీ దారుణంగా తయారవ్వొచ్చు. దీంతో ఎస్​ఆర్​హెచ్​ జట్టు కేన్​ కోసం గట్టిగానే పట్టుబట్టింది. అదే సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లలో ఆడటం తనకు కష్టమని చెప్పాడు. ఇది కోల్​కత నైట్​ రైడర్స్​ బృందానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. గత మొదటి దఫా మ్యాచ్​లలో బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా కమిన్స్​ రాణించాడు. అయితే సీనియర్​ ఫాస్ట్​ బౌలర్​ లేకపోతే మోర్గాన్​ బృందానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bcci, Cricket, Dubai, IPL 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు