Home /News /sports /

BCCI CHIEF SOURAV GANGULY WANTED TO SEND SHOW CAUSE NOTICE TO VIRAT KOHLI OVER HIS COMMENTS IN PRESS CONFERENCE SK

Virat Kohli: టీమిండియాలో రచ్చ.. కొహ్లీపై బీసీసీఐ గరంగరం.. చర్యలకు సిద్ధమైన గంగూలీ..?

విరాట్ కొహ్లీ, సౌరవ్ గంగూలీ

విరాట్ కొహ్లీ, సౌరవ్ గంగూలీ

Virat Kohli Vs Ganguly: విరాట్ కొహ్లీకి షోాకాజ్ నోటీసు ఇవ్వడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ సిద్ధపడ్డారట. డ్రాఫ్ట్‌ లెటర్‌ను కూడా తయారు చేశారని తెలిసింది.

    టీమిండియాలో విరాట్ కొహ్లీ (Virat Kohli) వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి ఆయన్ను బీసీసీఐ (BCCI) తొలగించిన తర్వాత నెలకొన్ని పరిణామాలు పెద్ద రచ్చకే దారితీశాయి. బీసీసీఐ వర్సెస్ విరాట్ కొహ్లీ ఎపిసోడ్ భారత క్రికెట్ జట్టును కుదిపేసింది. ఐతే దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బీసీసీఐపై కొహ్లీ చేసిన వ్యాఖ్యలపై అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ (Sourav  Ganguly) గుర్రుగా ఉన్నారని.. ఏకంగా కొహ్లీపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సౌతాఫ్రికా టూర్‌కు ముందు కోహ్లి తనపై చేసిన వ్యాఖ్యలకు బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో సౌరవ్‌ గంగూలీ షోకాజ్‌ నోటీసు ఇవ్వబోయాడని సమాచారం. ఐతే బీసీసీఐ బోర్డులో ఒక సభ్యుడి ఒత్తిడితో గంగూలీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది.

    ఒడియమ్మ మ్యాక్స్‌వెల్.. నీ బాదుడుకి దండం సామీ.. 64 బంతుల్లో సునామీ ఇన్నింగ్స్..

    ఇండియా హెడ్‌న్యూస్‌ కథనం ప్రకారం.. విరాట్ కొహ్లీకి షోాకాజ్ నోటీసు ఇవ్వడానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ సిద్ధపడ్డారట. డ్రాఫ్ట్‌ లెటర్‌ను కూడా తయారు చేశారు. కానీ బోర్డు సభ్యుడు ఒకరు అడ్డుపడడంతో గంగూలీ ఆ ఆలోచనను విరమించుకున్నారట. దక్షిణాఫ్రికా పర్యటన (Team India SouthAfrica Tour)కు ముందు బీసీసీఐపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని ఈ కథనంలో పేర్కొన్నారు. ఒకవేళ విరాట్ కోహ్లికి గంగూలీ షోకాజ్‌ నోటీసు ఇచ్చి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. దానిని అవమానంగా భావించి కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకునేవారని చెబుతున్నారు.

    ఇదేందయ్యా రాహుల్.. నువ్వు చెప్పేది ఒకటి.. చేసేది ఇంకొకటా.. ఇట్టా అయితే ఎట్టా?

    ప్రస్తుతం టీమిండియాలో ఒక ఆటగాడిగా మాత్రమే కొహ్లీ కొనసాగుతున్నాడు. ఏ ఫార్మట్‌లోనూ అతడు కెప్టెన్‌గా లేడు.  ఆ మధ్య టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ స్వయంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతడిని తప్పిస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కొహ్లీ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా పర్యటనకు ముందు మీడియా ముందుకు వచ్చి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీ విషయంలో తనను అడగకుండానే బీసీసీఐ నిర్ణయం తీసుకుందని బాంబు పేల్చారు. కానీ కొహ్లీతో చర్చించిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పించామని అంతకు ముందు బీసీసీఐ తెలిపింది. కానీ అలాంటి చర్చలేవీ జరగలేదని.. బీసీసీఐ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కొహ్లీ కుండబద్దలు కొట్టారు.

    Virat Kohli Earnings: విరాట్ కోహ్లీకి బీసీసీఐ ఎంత జీతం ఇచ్చింది.. బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా?

    కొహ్లీ ప్రెస్ మీట్ తర్వాత.. ఈ వివాదం మరింత రచ్చకు దారితీసింది. ఒకానొక సమయంలో కొహ్లీ వర్సెస్ గంగూలీగా మారిపోయింది. ఆ తర్వాత భారత మాజీ ఆటగాళ్లు జోక్యం చేసుకొని.. కొహ్లీ తన ఆటపై దృష్టి పెట్టాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా టెస్టు సిరీస్‌ కోల్పోయిన తర్వాత విరాట్‌ కోహ్లి టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి ఒక సీనియర్‌ ప్లేయర్‌గా జట్టుకు అందుబాటులో ఉంటానని, ఇన్ని రోజులు తనకు కెప్టెన్సీ అవకాశమిచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పెద్ద సందేశాన్ని రాసుకొచ్చాడు కొహ్లీ. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bcci, Cricket, Sourav Ganguly, Sports, Virat kohli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు