BCCI CHIEF SOURAV GANGULY DISCHARGED FROM HOSPITAL SSR
నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. దాదాను డిశ్చార్జ్ చేసిన వైద్యులు
SOURAV GANGULY ( ఫైల్ ఫోటో)
ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని వైద్యులు ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గంగూలీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యాంజియోప్లాస్టీ చేయడంతో...
కోల్కత్తా: ఛాతి నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీని వైద్యులు ఆదివారం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. గంగూలీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యాంజియోప్లాస్టీ చేయడంతో గురువారం రాత్రి వరకూ దాదాకు ఐసీయూలోనే వైద్యులు చికిత్సనందించారు. డాక్టర్ దేవీ శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతాలతో కూడిన వైద్య బృందం గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించింది. అతని రక్తనాళాల్లో ఏర్పడిన పూడికలను తొలగించడానికి రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
జనవరి తొలి వారంలో గంగూలీ వ్యాయామం చేస్తుండగా స్వల్ప గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. అతని గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశారు. గంగూలీ ట్రెడ్‌మీల్ చేశాడని, దాంతో స్వల్ప గుండెపోటు వచ్చిందని ఆ సందర్భంలో వైద్యులు వివరించారు. బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాక గంగూలీ పూర్తి బిజీగా మారడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. బోర్డు వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్నాడు. కరోనా కారణంగా దేశంలో క్రికెట్‌కు బ్రేక్ పడిన వేళ ఐపీఎల్ నిర్వహణకు దాదా ఎంతగానో శ్రమించాడు.
యూఏఈలో ఐపీఎల్ జరిపేందుకు పలుమార్లు అక్కడకు వెళ్లడం, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు జరపడం, మూడు వేదికల్లో బయోబబుల్ ఏర్పాట్లు, ఎనిమిది జట్లను అక్కడకు తరలించడం, ఇంతలోనే చెన్నై జట్టులో కోవిడ్ కేసులు.. ఇలాంటి పరిణామాలన్నీ గంగూలీకి సవాల్‌గా నిలిచాయి. ఎన్నో వ్యయప్రయాసలకు లోనైన బీసీసీఐ, టోర్నీ పాలకమండలి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాయి. గంగూలీ గత కొంత కాలంగా వరుస ప్రయాణాలు చేయడంతో పాటు, చీఫ్‌గా ఉండే పని ఒత్తిడి కూడా ఆయన అనారోగ్యానికి కారణం అయి ఉండొచ్చని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.