Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ

MS Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.

news18-telugu
Updated: September 12, 2019, 6:12 PM IST
Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ క్లారిటీ
ధోనీ (File)
news18-telugu
Updated: September 12, 2019, 6:12 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోరీ రిటైర్ అవుతారనే పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు తన రిటైర్మెంట్‌ను ప్రకటించేందుకు ధోనీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ధోనీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు ధోనీ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించింది. ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ‘ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ వార్తలు అవాస్తవం.’ అని ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు తెలిపారు. వరల్డ్ కప్ ‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రెండు నెలల పాటు విశ్రాంతి కావాలని ధోనీ కోరాడు. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోనీ పారామిలటరీ ట్రైనింగ్ కోసం వెళ్లాడు. జమ్మూకాశ్మీర్‌లో కూడా కొన్ని రోజులు విధులు నిర్వర్తించాడు. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికా టూర్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, అందులో ధోనీకి చోటు దక్కలేదు.

వరల్డ్ కప్ నుంచి ధోనీ రిటైర్మెంట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, మిస్టర్ కూల్ మాత్రం ఎక్కడా ప్రకటన చేయలేదు. తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారనే ప్రచారం సాగడంతో అది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకేనని క్రీడాభిమానులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...