అందుకే అంబటి రాయుడిని సెలక్ట్ చేయలేదంటున్న ఎంఎస్‌కే ప్రసాద్

‘కొన్ని కాంబినేషన్స్ వలన వరల్డ్ కప్‌కు అతడిని సెలక్ట్ చేయలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని సెలక్షన్ కమిటీ పక్షపాతంతో ఉంటుందనకూడదు.’ అని ఎంఎస్‌కే ప్రసాద్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు.

news18-telugu
Updated: July 21, 2019, 3:59 PM IST
అందుకే అంబటి రాయుడిని సెలక్ట్ చేయలేదంటున్న ఎంఎస్‌కే ప్రసాద్
అంబటి రాయుడు (Image : Twitter)
  • Share this:
వరల్డ్ కప్‌లో అంబటి రాయుడును సెలక్ట్ చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘టీ 20ల్లో అతడి ప్రదర్శనను పరిశీలించిన తర్వాత రాయుడును వన్డేల్లోకి తీసుకున్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. కానీ, మేం అతడి గురించి కొన్ని ఆలోచనలు చేశాం. ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయినప్పుడు అతడిని శరీరదారుఢ్య ప్రోగ్రాంకి పంపాం. కొన్ని కాంబినేషన్స్ వలన వరల్డ్ కప్‌కు అతడిని సెలక్ట్ చేయలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని సెలక్షన్ కమిటీ పక్షపాతంతో ఉంటుందనకూడదు.’ అని ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన జట్టులో అంబటిరాయుడుకు చోటు దక్కలేదు. ఆ తర్వాత శిఖర్ ధావన్ గాయం కారణంగా తప్పుకొన్నాడు. ధావన్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చింది సెలక్షన్ కమిటీ. దీనిపై అంబటి రాయుడు తీవ్రంగా స్పందించాడు. రిషబ్ పంత్‌ను మూడు కోణాల్లో వినియోగించుకోవచ్చన్న ఉద్దేశంతోనే అతడిని సెలక్ట్ చేశామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చెప్పడంతో తాను త్రీడీ కళ్ళద్దాలు కొనుక్కుంటున్నానంటూ వెటకారం చేశాడు. ఆ తర్వాత మరోసారి విజయ్ శంకర్ గాయం కారణంగా వైదొలగడంతో అతడి ప్లేస్‌లో మయాంక్ అగర్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశాడు. దీంతో అంబటిరాయుడు తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు.

అంబటి రాయుడు త్రీడీ ట్వీట్ ఫుల్ పాపులర్ అయింది. అది ఎంఎస్‌కే ప్రసాద్ దృష్టికి కూడా వెళ్లింది. రాయుడు ట్వీట్‌ను తాను ఎంజాయ్ చేశానని చెప్పాడు ఎంఎస్‌కే ప్రసాద్. ‘రాయుడు ట్వీట్ చాలా బావుంది. నేను చాలా ఎంజాయ్ చేశా. మంచి టైమింగ్‌తో వచ్చిన ట్వీట్.’ అని ఎంఎస్‌కే ప్రసాద్ అన్నాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 21, 2019, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading