BCCI చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తూ బీసీసీఐ కార్యదర్శి జైషాకు చేతన్ శర్మ రాజీనామా లేఖను పంపారు. చేతన్ శర్మ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. ఇటీవల అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే రాజీనామాకు కారణం అని తెలుస్తుంది.
ఇటీవల ఓ మీడియా హౌస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ భారత క్రికెటర్ల సెలెక్షన్, ఆటగాళ్ల మధ్య విబేధాలు, ఫిట్ నెస్ ఇలా చాలా అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకొని ఫిట్ నెస్ పరీక్షలకు హాజరవుతున్నారని కామెంట్స్ చేశారు. వాళ్ళు తీసుకునే ఇంజెక్షన్లు డోపింగ్ టెస్టుల్లో కూడా దొరకవని అన్నారు. చాలా మంది ఫిట్ గా లేకపోయిన కూడా ఈ ఇంజక్షన్లు తీసుకొని ఆడుతున్నారని అన్నారు. 80 శాతం ఫిట్ గా ఉన్న ఈ ఇంజక్షన్ తీసుకుంటే పూర్తిగా ఫిట్ అవుతారని చేతన్ (Chetan Sharma) షాకింగ్ కామెంట్స్ చేశారు.
అంతేకాదు గంగూలీ, కోహ్లీ, రోహిత్ మధ్య కూడా అసలు పడదని, తనను కెప్టెన్ గా తప్పించడంలో గంగూలీ పాత్ర ఉందని భావించిన కోహ్లీ ఆయన పేరు వింటేనే మండిపడతారని అన్నారు. ఇక చేతన్ శర్మ వ్యాఖ్యలను బీసీసీఐ సీరియస్ గా తీసుకుంది. అంతర్గత వ్యవహారాలను వేదికపైన మాట్లాడడం రూల్స్ కు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఎఫెక్ట్ తో తనపైన వేటు తప్పదనుకున్నారో ఏమో కానీ ఇంతలోనే తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు మెయిల్ చేశారు. ఇక ఈ రాజీనామాను జైషా ఆమోదించినట్లు తెలుస్తుంది.
BCCI chief selector Chetan Sharma resigns from his post. He sent his resignation to BCCI Secretary Jay Shah who accepted it.
(File Pic) pic.twitter.com/1BhoLiIbPc — ANI (@ANI) February 17, 2023
రోహిత్-కోహ్లీ మధ్య ఇగో క్లాష్..
రోహిత్-కోహ్లీ మధ్య ఇగో క్లాష్ ఉందని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. జట్టులో రోహిత్, కోహ్లీ వర్గాలు ఉండేవన్నారు. ఇక యువఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికే కోహ్లీ, రోహిత్ లను టీ 20 ఫార్మాట్ నుంచి తప్పించారన్నారు. ఇక భవిష్యత్తులో కూడా వీళ్లకు అవకాశాలు రాకపోవచ్చని అన్నారు. ఇక చేతన్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ లో సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై వేటు పడేదానికంటే ముందే రాజీనామా చేస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకోగా..దిద్దుబాటు చర్యల్లో భాగంగా రాజీనామాను ఆమోదించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.