• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • BCCI ANNUAL CONTRACTS VIRAT KOHLI ROHIT SHARMA AND JASPRIT BUMRAH RETAINED IN A PLUS CATEGORY SIRAJ IN C CATEGORY SA

BCCI contracts: క్రికెటర్ల వార్షిక వేతనాలు.. కోహ్లీ, రోహిత్‌‌కు రూ.7 కోట్లు.. సిరాజ్‌‌కు ఎంతంటే!

BCCI contracts: క్రికెటర్ల వార్షిక వేతనాలు.. కోహ్లీ, రోహిత్‌‌కు రూ.7 కోట్లు..  సిరాజ్‌‌కు ఎంతంటే!

kohli rohith

టీమ్ ఇండియాలో ఆడబోయే వార్షిక ప్లేయర్ కాంట్రాక్టులను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) గురువారం ప్రకటించింది.

  • Share this:
    2020 అక్టోబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు టీమ్ ఇండియాలో ఆడబోయే వార్షిక ప్లేయర్ కాంట్రాక్టులను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) గురువారం ప్రకటించింది. ఇందుకు ఆటగాళ్లను A +, A, B, C. నాలుగు విభాగాలుగా విభజించారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ,జస్‌ప్రీత్ బుమ్రాలను A + విభాగంలో చేర్చారు. వీరి వార్షిక వేతనం రూ.7 కోట్ల చొప్పున ప్రకటించింది.

    ఇక గతంలో గ్రేడ్ బి విభాగంలో ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రేడ్ ఎ కేటాగిరికి ప్రమోట్ చేశారు. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కుమార్ గ్రేడ్ ఎ నుండి గ్రేడ్ బి విభాగానికి తగ్గించారు.





    గతంలో గ్రేడ్ బి విభాగంలో ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రేడ్ ఎ విభాగానికి చేరుకున్నారు. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కుమార్ గ్రేడ్ ఎ నుండి గ్రేడ్ బి విభాగంలో చోటు దక్కించుకున్నారు. ఇక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గ్రేడ్ సి కి పడిపోగా, కేదార్ జాదవ్, మనీష్ పాండేతో బీసీసీఐ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. షుబ్మాన్ గిల్, మొహమ్మద్ సిరాజ్ గ్రేడ్ సి చేర్చారు. ఈ యంగ్ ఆటగాళ్ళు రూ .1 కోట్ల విలువైన సెంట్రల్ కాంట్రాక్టులను పొందారు. A గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, B గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, C గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున ప్రకటించనట్లు బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పెర్కొంది.

    A+ గ్రేడ్‌ ఆటగాళ్ళు : విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా

    A గ్రేడ్‌ ఆటగాళ్ళు: మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌,

    * B గ్రేడ్‌ ఆటగాళ్ళు: శార్దూల్‌ ఠాకూర్‌, మయాంక్‌ అగర్వాల్‌, వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌,

    * C గ్రేడ్‌ ఆటగాళ్ళు: హనుమ విహారి, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, మహ్మద్‌ సిరాజ్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, నవ్‌దీప్‌సైని, దీపక్‌ చాహర్‌, శుభ్‌మన్‌ గిల్‌
    Published by:Rekulapally Saichand
    First published: