టీమిండియా మహిళా క్రికెటర్లకు (Women Cricketers) బీసీసీఐ (BCCI) శుభవార్త చెప్పింది. క్రికెట్లో లింగ సమానత్వానికి పెద్ద పీట వేస్తూ.. మ్యాచ్ ఫీజులపై కీలక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెటర్లకు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ హానరరీ సెక్రటరీ జై షా (Jay Shah) అధికారికంగా ప్రకటించారు.ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు ఫీజుగా చెల్లించనున్నారు.
'' వివక్ష రహిత క్రికెట్ కోసం బీసీసీఐ మొదటి అడుగు వేసిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కాంట్రాక్ట్ మహిళా క్రికెటర్లకు పే ఈక్విటీ పాలిసీని అమలు చేస్తున్నాం. ఇకపై పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు అందజేస్తాం. క్రికెట్లో లింగ సమానత్వానికి సంబంధించి కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాం.'' అని జైషా ట్వీట్ చేశారు.
The @BCCIWomen cricketers will be paid the same match fee as their male counterparts. Test (INR 15 lakhs), ODI (INR 6 lakhs), T20I (INR 3 lakhs). Pay equity was my commitment to our women cricketers and I thank the Apex Council for their support. Jai Hind ????????
— Jay Shah (@JayShah) October 27, 2022
మనదేశంలో క్రికెట్ ఒక మతంలా భావిస్తారు. ఏదైనా మ్యాచ్ జరిగితే స్టేడియాలు నిండిపోతాయి. టీవీల ముందు కోట్లాది మంది వీక్షిస్తారు. ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పూనకాలతో ఊగిపోతారు. అంతలా క్రికెట్ పిచ్చి ఉంది. ఐతే పురుషుల క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ మహిళా క్రికెట్‌కు లేదు. వ్యూయర్షిప్ చాలా తక్కువగా ఉంటుంది. బీసీసీఐకి కూడా తక్కువ ఆదాయం వస్తుంది. ఐనప్పటికీ ఆదాయంతో సంబంధ లేకుండా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజును చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.
కొన్నేళ్లుగా మహిళా క్రికెట్‌ను ప్రోత్సహిస్తోంది బీసీసీఐ. ఐపిఎల్లాగే విమెన్ టీ20 ఛాలెంజ్‌ని నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది నుంచి విమెన్ ఐపీఎల్ టోర్నీని నిర్వహంచనుంది. మొత్తం ఐదు జట్లతో తొలి మహిళా ఐపీఎల్ టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 22 మ్యాచ్‌లు ఉంటాయి. పురుషుల ఐపీఎల్ కంటే ముందుగానే మహిళల ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది చివర్లో WIPL 2023 వేలం జరుగుతుంది. ఇక బీసీసీఐ ప్రోత్సాహంతో మహిళల జట్టు కూడా అద్భుతాలు చేస్తోంది. ఇటీవల ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఏడోసారి ఆసియా కప్ గెలిచి చరిత్ర సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cricket, Sports, Women Cricket