వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా జట్టు ఇదే..

టీ20, వన్డే జట్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి. వన్డే జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు కల్పించారు.

news18-telugu
Updated: November 21, 2019, 8:53 PM IST
వెస్టిండీస్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా జట్టు ఇదే..
రెండో టీ20లో టీమిండియా గెలుపు
  • Share this:
వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ట్వీ 20తో పాటు వన్డే సిరీస్‌ ఆడబోతోంది కరీబియన్ జట్టు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో ఆడబోయే భారత జట్టును గురువారం సాయంత్రం బీసీసీఐ ప్రకటించింది. కోల్‌కతాలో టీమిండియా కొహ్లీతో చర్చల అనంతరం టీమ్‌ వివరాలను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. టీ20, వన్డే రెండు సిరీస్‌లకు విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా,  వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారు. ఇక టీ20, వన్డే జట్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి.  వన్డే జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు కల్పించారు.


జట్టు వివరాలు:టీమిండియా జట్లు


వెస్టిండీస్-ఇండియా సిరీస్ షెడ్యూల్ వివరాలు:

తొలి టీ20: డిసెంబరు 6 (శుక్రవారం), ముంబై, రాత్రి 07 గంటలకు
రెండో టీ20: డిసెంబరు 8 (ఆదివారం), తిరువనంతపురం, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: డిసెంబరు 11 (బుధవారం), హైదరాబాద్, రాత్రి 7 గంటలకుతొలి వన్డే: డిసెంబరు 15 (ఆదివారం), చెన్నై, మధ్యాహ్నం 2 గంటలకు
రెండో వన్డే: డిసెంబరు 18 (బుధవారం), విశాఖపట్టణం, మధ్యాహ్నం 2 గంటలకు
మూడో వన్డే: డిసెంబరు 22 (ఆదివారం), కటక్, మధ్యాహ్నం 2 గంటలకు
First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>