Home /News /sports /

BCCI ANNOUNCES RELEASE OF TENDER TO OWN AND OPERATE IPL TEAM CHECK DETAILS HERE JNK

BCCI Tenders: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల కోసం టెండర్లు పిలిచిన బీసీసీఐ.. ఐటీటీ డాక్యుమెంట్ విలువ ఎంతంటే..

ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్‌ కోసం బీసీసీఐ నోటిషికేషన్ (PC: IPL)

ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్‌ కోసం బీసీసీఐ నోటిషికేషన్ (PC: IPL)

BCCI Tenders: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ ఇంట్రెస్ట్ టూ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 5 వరకు ఈ ఐటీటీలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.

    బీసీసీఐ (BCCI) బంగారు బాతుగా పిలిచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) (ఐపీఎల్)లో మరో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టీ20 క్రికెట్ (T20 Cricket) లీగ్‌లో రెండు కొత్త జట్లను చేర్చాలని గవర్నింగ్ బాడీ (IPL Governing Body) నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ కొత్త జట్ల కోసం బిడ్లను ఆహ్వానించింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పేరుతో ఈ బిడ్ల కోసం ఐటీటీ (ఇన్విటేషన్ టు టెండర్) పిలిచారు. రెండు ఐపీఎల్ టీమ్‌లలో దేనినైనా ఒక దానిని సొంతం చేసుకొని నిర్వహించడానికి ఏదైనా సంస్థ టెండర్ వేయవచ్చని బీసీసీఐ ప్రకటనలో కోరింది. ఈ రెండు జట్లు ఐపీఎల్ 2022 నుంచి మనుగడలోకి వస్తాయని పేర్కన్నది. అయితే ఈ బిడ్లు వేయడానికి ఏయే సంస్థలకు అర్హత ఉన్నది.. నియమ నిబంధనలతో పాటు బిడ్లు ఎలా వేయాలి, కొత్త జట్లకు ఉండే హక్కులు, ఇతర వివరాలు అన్నీ ఐటీటీలో పేర్కొన్నట్లు బీసీసీఐ తెలిపింది.

    ఐటీటీ గడువు, ధర ఎంత?

    ఇన్విటేషన్ టూ టెండర్‌ను రూ. 10 లక్షలు + జీఎస్టీ చెల్లించి కొనుగోలు చేయవచ్చని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్టోబర్ 5 వరకు ఈ ఐటీటీ అందుబాటులో ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన సంస్థలు ittipl2021@bcci.tv కి మెయిల్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. కాగా ఈ మెయిల్ పంపించే వాళ్లు సబ్జెక్ట్ లైన్‌లో 'ITT for the Right to Own and operate one of two proposed new IPL teams' అని పేర్కొనాల్సి ఉంటుంది. కొత్త టీమ్స్ కోసం బిడ్లు దాఖలు చేయాలనుకునే సంస్థలు తప్పకుండా ఐటీటీని కొనుగోలు చేయాలని బీసీసీఐ తెలిపింది.





    ఇంకేం చెప్పింది?

    ఐటీటీని కొనుగోలు చేసినంత మాత్రాన ఏ సంస్థకు కానీ, వ్యక్తికి కానీ ఐపీఎల్‌లో టీమ్స్ కొనుగోలు చేసేందుకు బిడ్లు వేసే అర్హత రాదని చెప్పింది. ఐటీటీ కొనుగోలు చేసిన సంస్థలు/వ్యక్తుల వివరాలన్నీ క్రోఢీకరించిన తర్వాత టెక్నికల్‌గా ఓకే అయిన సంస్థలు/వ్యక్తులు మాత్రమే బిడ్లు వేసేందుకు అర్హత పొందుతారని బీసీసీఐ తెలిపింది. ఇక ఈ బిడ్ల ప్రక్రియను ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేయడానికి లేదా తాత్కాలికంగా నిలిపివేయడానికి బీసీసీఐకి అన్ని రకాల హక్కులు ఉన్నాయని పేర్కొన్నది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ మేరకు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    BCCI: బీసీసీఐ ఖజానాలోకి చేరనున్న రూ. 5000 కోట్లు? అంతా ప్లాన్ ప్రకారం జరిగితే క్రికెట్ బోర్డుకు డబ్బే డబ్బు


    కాగా, కొత్త టీమ్స్ వచ్చే ఏడాది నుంచి చేర్చబోతున్నట్లు బీసీసీఐ ప్రకటించినా.. ఏయే నగరాలు కేంద్రాలుగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తారో ప్రకటనలో పేర్కొనలేదు. ఐటీటీలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయని తెలుస్తున్నది. ఎవరైనా దీన్ని కొనుగోలు చేసి వివరాలు తెలియజేస్తే కాని బయట వ్యక్తులకు పూర్తి వివరాలు అందుబాటులోనికి రావు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి చివరి లోపు ఐపీఎల్ కొత్త టీమ్స్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత మెగా ఆక్షన్‌ నిర్వహిస్తారని తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, IPL

    తదుపరి వార్తలు