ఆస్ట్రేలియా, శ్రీలంక సీరియస్‌కు టీమిండియా జట్టు ఇదే

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నారు. షమీ స్థానంలో బుమ్రాకు అవకాశమిచ్చారు.

news18-telugu
Updated: December 23, 2019, 10:38 PM IST
ఆస్ట్రేలియా, శ్రీలంక సీరియస్‌కు టీమిండియా జట్టు ఇదే
టీమిండియా (Image: Cricketnext )
  • Share this:
వెస్టిండీస్ సిరీస్‌ను గెలిచి 2019 గ్రాండ్ ఫేర్‌‌వెల్ చెప్పనున్న టీమిండియా.. అంతే ఊపుతో 2020కి వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌ ఆడబోతోంది కొహ్లీ సేన. ఈ నేపథ్యంలో లంక, ఆసీస్ జట్లతో ఆడబోయే భారత జట్టను బీసీసీఐ ప్రకటించింది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చి శిఖర్ ధావన్‌ను జట్టులోకి తీసుకున్నారు. షమీ స్థానంలో బుమ్రాకు అవకాశమిచ్చారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లు జనవరి 5 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఇక ఆస్ట్రేలియాతో జనవరి 14 నుంచి 19 వరకు వన్డే మ్యాచ్‌లు జరగుతాయి.

శ్రీలంకతో టీ20 సీరిస్ ఆడే భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, సంజు శాంసన్‌, రిషభ్‌ పంత్‌(కీపర్‌), శివమ్‌ దూబె, యుజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్ యాదవ్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్ సైని, జాస్ప్రిత్ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, రిషభ్‌ పంత్‌(కీపర్‌), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, నవ్‌దీప్‌ సైని, జాస్ప్రిత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌.
First published: December 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు