సౌతాఫ్రికా (South Africa) వేదికగా ఫిబ్రవరి 10-26 మధ్య జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ (Women's T20 Worldcup 2023)కు టీమిండియా మహిళల జట్టు(Indian Women's Team)ను ప్రకటించింది బీసీసీఐ. హర్మన్‌ప్రీత్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ జట్టులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 25 ఏళ్ల అంజలికి చోటు దక్కింది. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించింది అంజలి. లెఫ్టార్మ్ సీమర్ అయిన అంజలి.. ఓపెనింగ్ స్పెల్ లో దూకుడుగా బౌలింగ్ చేసింది. ఇక, ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఆసీస్‌తో సిరీస్‌లో విఫలమైన జెమీమా టీమ్‌లో చోటు నిలబెట్టుకుంది. పేసర్ల కోటాలో రేణుకా ఠాకూర్, పుజా వస్త్రాకర్ ఎంపికయ్యారు. కానీ, వస్త్రాకర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బోర్డు ప్రకటించింది. మరో సీనియర్ పేసర్ శిఖా పాండేకు కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. 2021 అక్టోబర్‌లో వివాదాస్పద రీతిలో టీమ్ నుంచి తప్పించిన తర్వాత ఆమె తిరిగి జట్టులో చోటు దక్కించుకుంది.
స్పిన్ కేటగిరిలో ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, దేవికా వైద్యతో పాటు రాధా యాదవ్, రాజైశ్వరి ఎంపికయ్యారు. ప్రపంచకప్‌లో రిజర్వ్ ప్లేయర్లుగా తెలుగమ్మాయి సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘనా సింగ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న రిచా ఘోష్, షఫాలీ వర్మ నెల రోజుల వ్యవధిలో సీనియర్ టీమ్ తరఫున కూడా వరల్డ్ కప్ ఆడనుండటం విశేషం.
NEWS ???? - India squad for ICC Women’s T20 World Cup 2023 & tri-series in South Africa announced. More details here - https://t.co/3JVkfaDFPN #TeamIndia pic.twitter.com/FJex4VhAG6
— BCCI Women (@BCCIWomen) December 28, 2022
మరో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘనను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో భారత్ ఆడే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన టీమ్‌లో మాత్రం మేఘనకు అవకాశం దక్కింది. వరల్డ్‌కప్‌లో గ్రూప్2లో ఉన్న టీమిండియా.. ఫిబ్రవరి 12న తన తొలి మ్యాచ్‌ను కేప్‌టౌన్‌లో పాకిస్థాన్‌తో ఆడుతుంది. 15,18, 20 తేదీల్లో వరుసగా వెస్టిండీస్, ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ప్రపంచకప్ కంటే ముందు జనవరి 19 నుంచి సౌతాఫ్రికాలో ఆతిథ్య జట్టు, వెస్టిండీస్‌లతో భారత జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ కోసం కూడా జట్టును ప్రకటించారు.
అంజలి నేపథ్యం ఇదే..
అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. ఆమె ఎంపిక పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.
టీ20 ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్ (ఫిట్ నెస్ నిరూపించుకోవాలి), రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.
రిజర్వ్‌లు: సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, మేఘన సింగ్
ముక్కోణపు టోర్నీకి భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవిక వైద్య, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక ఠాకూర్, మేఘన సింగ్, అంజలి శర్వాణి, సుష్మ వర్మ, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, స్నేహ్ రాణా, శిఖా పాండే, పూజ వస్త్రాకర్ (ఫిట్‌నెస్ సాధిస్తేనే).
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Smriti Mandhana, Team India, Women's Cricket