స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. రోహిత్ శర్మ,(Rohit Sharma) విరాట్ కోహ్లి,(Virat Kohli) KL రాహుల్ వంటి వారు మూడు టీ20 మ్యాచ్‌లలో పాల్గొననప్పటికీ వారు ODI జట్టులో ఎంపికయ్యారు. వన్డే సిరీస్ కోసం, శిఖర్ ధావన్ (Shikar Dhawan)జట్టు నుండి తప్పించారు. ఇందులో శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మరియు శ్రేయాస్ అయ్యర్ బ్యాటర్లుగా ఉన్నారు. రాహుల్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా జట్టులో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 50 ఓవర్ల సిరీస్‌కు కెప్టెన్ రోహిత్‌కి డిప్యూటీగా నియమితుడయ్యాడు. రిషబ్ పంత్ జట్టు నుండి మినహాయించారు.
జట్టులో అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ జట్టులో స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్లు కాగా, కుల్దీప్ యాదవ్ ప్రీమియర్ స్పిన్నర్‌గా ఉన్నారు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ మరియు అర్ష్‌దీప్ సింగ్ వన్డే సిరీస్‌కు భారత పేస్ బౌలింగ్ కోసం ఎంపిక చేశారు. మొత్తంగా జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా (VC), వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ ఎంపికయ్యారు.
శ్రీలంకతో జరగబోయే మూడో వన్డేల సిరీస్.. జనవరి 10న గౌహతిలో వన్డేతో ప్రారంభం కానుంది. అనంతరం కోల్‌కతా, తిరువనంతపురం జనవరి 12 జనవరి 15న రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 మ్యాచ్‌ల కోసం కూడా జట్టును ప్రకటించారు.
Virat Kohli : టి20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై! మరీ బీసీసీఐ నిర్ణయమేంటి?
ఇందులో హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (WK), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (VC), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ పటేల్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్‌కు చోటు లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sri Lanka, Team India